HomeLATESTఅయ్యో.. అన్నదాత: తెలంగాణలో 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం; టుడే న్యూస్ ఏప్రిల్ 26

అయ్యో.. అన్నదాత: తెలంగాణలో 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం; టుడే న్యూస్ ఏప్రిల్ 26

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల ఘాతుకం: 10 మంది పోలీసులు, డ్రైవర్​ మృతి

ఛత్తీస్‌గఢ్‌ లోని బస్తర్‌ జిల్లాలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. దంతేవాడలో పోలీసుల వాహనాన్ని లక్ష్యంగా చేసుకుని మందుపాతరతో పేలుడు జరిపారు. ఈ ఘటనలో 10 మంది పోలీసులు, డ్రైవర్‌ ప్రాణాలు కోల్పోయారు. దంతేవాడ అడవుల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో బుధవారం ఉదయమే డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్‌ (డీఆర్‌జీ) ప్రత్యేక యాంటీ-నక్సలైట్‌ ఆపరేషన్‌ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ ముగించుకుని మినీ వ్యాన్‌లో పోలీసులు తిరిగి వస్తుండగా మావోయిస్టులు ఐఈడీతో దాడి చేసి వ్యాన్‌ను పేల్చేశారు. 10 మంది పోలీసులు, వ్యాన్‌ డ్రైవర్‌ అక్కడికక్కడే మృతిచెందారు. కొందరు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ ఐజీ ఈ ఘటనపై అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భగేల్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన నక్సల్స్‌ ను ఉపేక్షించేది లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం భగేల్‌తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

Advertisement

బేషరతుగా సమ్మె విరమించిన విద్యుత్ ఆర్టిజన్స్

విద్యుత్ ​సంస్థల ఆర్టిజన్స్​బేషరతుగా సమ్మె విరమించారు. దీంతోపాటు నిన్న సమ్మెలో పాల్గొన్న 200 మంది ఆర్టిజన్లను విద్యుత్‌‌ సంస్థల యాజమాన్యం టర్మినేట్‌‌ చేయగా.. వారిని మళ్లీ డ్యూటీలోకి తీసుకోవాలని సీఎండీ ప్రభాకర్​రావుకు కార్మికులు విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన సీఎండీ.. సమ్మెలో ఉన్న ఆర్టిజన్స్​వెంటనే విధుల్లోకి చేరాలని ఆదేశించారు. యూనియన్లకు అతీతంగా సమ్మెలో పాల్గొనడానికి ముందుకు వచ్చిన ఆర్టిజన్లు ఉద్యోగాల తొలగింపుతో వెనక్కి తగ్గినట్టు తెలుస్తున్నది.

గాలి దుమారం, వడగండ్లతో 4 లక్షల ఎకరాల్లో పంట నష్టం

వడగండ్ల వానలతో రాష్ట్రమంతటా భారీగా పంట నష్టం వాటిల్లింది. పంట నష్టం వాటిల్లడంతో తమకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని పలు చోట్ల రైతులు రోడ్డెక్కారు. వడగండ్ల వానలు, ఈదురు గాలులకు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. కామారెడ్డి జిల్లాలోని లింగయ్య పల్లి, కొట్టాలపల్లి రైతులు రెండు గంటలపాటు రోడ్డుపై ధర్నా చేశారు. అదే జిల్లాలో పాత రాజంపేట రైతులు కూడా మెయిన్ రోడ్డుపై ధర్నా చేశారు.. రైతులను ఆదుకోవాలని కోరారు. రైతులకు మద్దతుగా అధికార పార్టీ చెందిన కామారెడ్డి జడ్పీటీసీ రమాదేవి, ఆమె భర్త లక్ష్మారెడ్డి రాస్తారోకోలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లాలో కదంబాపూర్ గ్రామంలో రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్​ ప్రకటన విడుదల చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని.. అండగా ఉంటామని మంత్రి హరీశ్​రావు భరోసా ఇచ్చారు. ఆయన సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

ఎకరాకు రూ.20 వేల పరిహారమివ్వాలి : రేవంత్ రెడ్డి

పంట నష్టం అంచనా వేసి ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం ఇవ్వాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ ​చేశారు. ఆదిలాబాద్​ జిల్లాలో నిరుద్యోగ దీక్షకు బయల్దేరిన రేవంత్​రెడ్డి మార్గమధ్యంలో కామారెడ్డి మండలం నరసన్న పల్లి శివారులో, రాజంపేట మండలం పొందుర్తిలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు. ‘బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం విఫలమైంది. ఈ నెపాన్ని కేసీఆర్ కేంద్రంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైతులు పంట నష్టపోతే.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఆత్మీయ సమ్మేళనాల పేరుతో దావత్ లు సుకుంటున్నారు. తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేలు, మామిడి రైతులకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు.

Advertisement

షర్మిల ‘టీ-సేవ్’ దీక్ష.. గద్దర్ మద్దతు

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు మద్దతుగా అఖిలపక్ష నాయకులతో చేపట్టాలనుకున్న ‘టీ సేవ్’ దీక్ష ఎట్టకేలకు ఇందిరాపార్క్ వద్ద నిర్వహించారు. రాష్ట్రంలో పేపర్ లీకేజి అంశం, సర్కార్ తీరుపై నిరుద్యోగుల గళాన్ని వినిపించడమే లక్ష్యంగా ఈ దీక్షకు పూనుకున్నారు. ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ఈ నిరాహార దీక్షలో వైఎస్ షర్మిల (Ys Sharmila) పాల్గొన్నారు. ఈ సందర్బంగా పేపర్ లీకేజిపై సిట్ తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు పలువురు అఖిలపక్షం నేతలతో పాటు ప్రజా యుద్ధ నౌక గద్దర్ కూడా హాజరై మద్దతు తెలిపారు.

వివేకానందరెడ్డి కేసుపై స్పందించిన షర్మిల

తన చిన్నాన్న వివేకానందరెడ్డి మీద కొన్ని మీడియా సంస్థలు దారుణంగా ప్రచారం చేస్తున్నాయని వైఎస్ షర్మిల తీవ్రంగా తప్పుబట్టారు. వివేకా వ్యక్తిత్వం గురించి, వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే అర్హత ఆ మీడియా సంస్థలకు లేదని స్పష్టం చేశారు. మీడియా సంస్థలకు విలువలు ఉండాలి.. అవి లేని రోజున విశ్వసనీయత కోల్పోతారన్నారు. ఈ మేరకు ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. వివేకానందరెడ్డిని ఒక ప్రజా నాయకుడిగా మాత్రమే చూడాలని వైఎస్ షర్మిల అన్నారు. ఈ రోజున వివేకానందరెడ్డి మన మధ్య లేరని.. అసలు లేని వ్యక్తి మీద.. ఇంత ఘోరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దారుణమన్నారు.

పొంగులేటికి మద్దతుగా బీఆర్​ఎస్​కు జెడ్పీటీసీ రాజీనామా

ఖమ్మం జిల్లాలో పొంగులేటికి మద్దతుగా గార్ల మండల జడ్పీటీసీ జాటోత్ ఝాన్సీలక్ష్మి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. 30 మంది వార్డు మెంబర్లు, మండల స్థాయి కార్యకర్తలతో కలిసి అధికార పార్టీకి రిజైన్​చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోరం కనకయ్యను సస్పెండ్ చేసినందుకు నిరసన తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు.

Advertisement

విమానంలో కొట్టుకున్న ప్యాసింజర్లు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్​

విమానంలో ప్యాసింజర్లు కొట్టుకున్నారు. కెయిర్న్​ నుంచి నార్తర్న్‌ టెరిటరీ ఆఫ్‌ ఆస్ట్రేలియాకు వెళ్తోన్న విమానంలో నలుగురు ప్యాసింజర్లకు గొడవైంది. అందులో ఒక మహిళ ఉంది. ఒక ప్యాసింజర్​ సీసాతో మరొకడి తలను పగలగొట్టాడు. ఆ కొట్లాటతో ఫర్నీచర్ కూడా దెబ్బతింది. విమాన సిబ్బందికి వారిని నియంత్రించడం సాధ్యం కాలేదు. దీంతో పైలెట్ బస్సును ఆపినట్టు, విమానాన్ని క్వీన్‌ల్యాండ్స్‌ ఎయిర్‌పోర్టులో అత్యవసరంగా దించాడు. విమానం ల్యాండ్ కాగానే ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు.

సింగపూర్​కు గంజాయి స్మగ్లింగ్​ చేసిన ఇండియన్​కు ఉరి

మన దేశంలో అక్రమ మాదకద్రవ్యాల స్మగ్లింగ్ కేసును నేరంగా పరిగణిస్తారు. దోషులకు చిన్న శిక్ష మాత్రమే విధిస్తారు. కాని పొరుగు దేశమైన సింగపూర్‌లో మాత్రం అలా కాదు. అక్కడ గంజాయి స్మగ్లింగ్ చేసి పట్టుబడిన ఓ నేరస్తుడికి ఉరిశిక్ష విధించింది న్యాయస్థానం. 2014లో తంకరాజు సుప్పయ్య అనే 46ఏళ్ల వ్యక్తిని గంజాయి స్మగ్లింగ్ చేస్తుండగా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత 2018 అక్టోబర్ 9న ఉరిశిక్ష విధించింది అక్కడి న్యాయస్థానం. సింగపూర్ చట్టాల ప్రకారం కిలో కంటే ఎక్కువ గంజాయి తరలించకూడదు. ఆ నేరాన్ని చేసినందుకే తంకరాజు సుప్పయ్య మరణశిక్ష పడింది. థంకరాజు సుప్పయ్య మరణశిక్షను అమలు చేయరాదని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సంస్థ కూడా రంగంలోకి దిగింది. బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ మరియు అనేక దేశాలు మరణశిక్షను వ్యతిరేకించాయి. అయిన మరణ శిక్ష అమలుకే సింగపూర్​ మొగ్గు చూపింది.

సుడాన్​ నుంచి తెలంగాణ వాసుల రాక

‘ఆపరేషన్ కావేరి’ లో భాగంగా సూడాన్లో ఉన్న భారతీయులను కేంద్రం దశలవారీగా ఢిల్లీ, ముంబైలకు తరలిస్తోంది. ఇప్పటి వరకు సుమారు 160 మంది ఇండియన్స్ ఢిల్లీకి చేరుకున్నట్లు తెలుస్తోంది. సూడాన్ నుంచి వస్తున్న భారతీయుల విషయమై అన్ని రాష్ట్రాల రెసిడెంట్ కమిషనర్ ను విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. అక్కడున్న తెలంగాణ వాసులను తరలించేందుకు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నలుగురు తెలంగాణ వాసులు వస్తున్నారని, వారికి వసతి, భోజనం ఏర్పాటు చేసి హైదరాబాద్‌‌‌కు పంపే ఏర్పాటు చేస్తున్నట్లు రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తెలిపారు.

Advertisement

సమంతకు గుడి కట్టిస్తున్న వీరాభిమాని

బాపట్ల జిల్లా ఆలపాడుకు చెందిన సందీప్‌ అనే యువకుడు సమంత కోసం ఏకంగా తన ఇంట్లో గుడి కట్టిస్తున్నాడు. సమంత పుట్టిన రోజు ఏప్రిల్ 28న ప్రారంభించాలని ఏర్పాట్లు చేస్తున్నాడు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!