నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. బీఎస్ఎఫ్ లో 34 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్సై, కానిస్టేబుల్ గ్రూప్ బి, సి పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులకు ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాలు :
-ఎస్సై 3 పోస్టులు
-కానిస్టేబుల్ 1 పోస్టు
-కానిస్టేబుల్ (ఎస్ కేటీ) 1 పోస్టు
-కానిస్టేబుల్ (ఫిట్టర్) 4 పోస్టులు
-కానిస్టేబుల్ ( కార్పెంటర్) 2 పోస్టులు
-కానిస్టేబుల్ (ఏఈ) 1 పోస్టు
-కానిస్టేబుల్ (వెహికల్ మెకానిక్) 22 పోస్టులు
-కానిస్టేబుల్ (బీఎన్ టీఎస్) 2 పోస్టులు
-కానిస్టేబుల్ ( అప్ హోల్ స్టర్ ) 1 పోస్టు
మొత్తం పోస్టుల సంఖ్య 34
అర్హతలు:
మెట్రిక్యులేషన్ సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ( ఆటో మొబైల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ ) ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం కూడా ఉండాలి.
వయస్సు:
గ్రూప్ బి పోస్టులకు 30ఏళ్లు మించి ఉండకూడదు. గ్రూప్ సి పోస్టులకు 18 ఏళ్ల నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం:
నెలకు గ్రూప్ బి ఖాళీలకు రూ. 35,400-1,12,400, గ్రూప్ సి ఖాళీలకు రూ. 21,700-69,100 ఉంటుంది.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ పరీక్ష, ఫిజికల్ ఎఫిషియోన్సీ టెస్టు, ప్రాక్టికల్ ట్రేడ్ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంటేషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
గ్రూప్ బి కి రూ. 200 ఉండగా గ్రూస్ సీ పోస్టులకు రూ. 100 ఉంటుంది.
దరఖాస్తు విధానం:
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17,06,2024