తెలంగాణ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ (TSPOLYCET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం మే 24న పాలీసెట్ పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది పాలీసెట్ పరీక్షకు 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 84.20 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. మొత్తం 69728 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీల్లో మొత్తం 32614 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది కొత్తగా షాద్ నగర్లో పాలిటెక్నిక్ కాలేజీని ప్రారంభించారు.