ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (ITI) అనేది విద్యార్థులకు వృత్తి శిక్షణను అందించే సంస్థ.విద్యార్థులకు ఉద్యోగాలను చేపట్టడానికి వారిని సిద్ధం చేసేందుకు పరిశ్రమ ఆధారిత ట్రైనింగ్ ఇస్తుంది. ఈ ఐటీఐ కింద ఎలక్ట్రిషన్, డ్రాఫ్ట్ ట్రైనింగ్, బేకింగ్ వంటి కోర్సులు బోధిస్తారు. ఉన్నత పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు లేదా ఉన్నత పాఠశాల పూర్తి చేసిన విద్యార్థులకు ప్రవేశం ఉంటుంది. దీనికి సంబంధించి దరఖాస్తులు చేసుకోవాలి.
ప్రాథమిక విద్యను పూర్తిచేయలేని యువతలో స్కిల్స్ పెంపొందించడమే ఐటీఐ ప్రధాన లక్ష్యం. దీనిలో చేరేందుకు 10తరగతి లేదా 12వ తరగతి పాసై ఉండాలి. తమ విద్యను కొనసాగించలేని వ్యక్తులు ఈ కోర్సు చేయవచ్చు. కానీ ఇంటి పరిస్థితుల కారణంగా ఉన్నత చదువులకు చాలా మంది విద్యార్థులు దూరం అవుతున్నారు.
హనుమకొండ జిల్లా కాజీపేటలో ఉన్న ప్రభుత్వ ఐటీఐ 2024 విద్య సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ అశోక్ కుమార్ తెలిపారు. టెన్త్ పాసైన విద్యార్థులు ఇందుకు అర్హులని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు అప్లయ్ చేసుకోవచ్చని సూచించారు. ఎలక్ట్రిషన్ 20, ఎలక్ట్రానికే మెకానిజం 24, టర్నర్ 20, డ్రాఫ్ట్ మ్యాన్ సివిల్ 24, డ్రెస్ మేకింగ్ 40, స్టేనో 24 సీట్లు ఉన్నట్లు తెలిపారు. అభ్యర్థులు జూన్ 10వ తేదీలోగా అప్లయ్ చేసుకోవచ్చని సూచించారు.