గ్రూప్ 1 ప్రిలిమ్స్ (GROUP 1 PRELIMS) పరీక్షకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) మరో కీలక ప్రకటన విడుదల చేసింది. అభ్యర్థులందరూ తప్పనిసరిగా తమ హాల్ టికెట్లపై తమ లేటెస్ట్ పాస్‌పోర్టు సైజ్ ఫోటోను అతికించాలని స్పష్టం చేసింది. లేటెస్ట్ ఫొటో అంటే గడిచిన మూడు నెలల్లోపు ఫోటో అయి ఉండాలని ప్రత్యేకంగా ప్రస్తావించింది. అందుకే అభ్యర్థులు 2024 మార్చి తర్వాత దిగిన ఫొటోను హాల్ టికెట్‌పై అతికించాల్సి ఉంటుంది. హల్ టికెట్‌పై నిర్దేశించిన ఖాళీ బాక్స్‌లో ఈ ఫొటోను పరీక్ష హాల్‌కు రాకముందే అతికించుకొని రావాలని స్పష్టం చేసింది. హాల్ టికెట్‌పై ఫోటో లేకుంటే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని స్పష్టం చేసింది. అందుకు సంబంధించిన నోట్‌ను యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాం.