Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : మార్చి ​2024

కరెంట్​ అఫైర్స్​ : మార్చి ​2024

అంతర్జాతీయం

బిలియనీర్లకు అడ్డాగా న్యూయార్క్
‘హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్-–2024’ ప్రకారం ఆసియాలో బిలియనీర్లకు అడ్డాగా బీజింగ్(91)​ను వెనక్కి నెట్టి ముంబై (92) టాప్​లో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల జాబితాలో ముంబై మూడో ప్లేసులో ఉంది. 119 మందితో న్యూయార్క్ మొదటి స్థానం సంపాదించింది. 97 మందితో లండన్ సెకండ్ ప్లేస్, 92 మందితో ముంబై థర్డ్ ప్లేసులో ఉంది.

పాలస్తీనాకు కొత్త ప్రధానిగా ముస్తఫా
ఇజ్రాయెల్‌తో యుద్ధ సమయంలో ‘పాలస్తీనా’కు కొత్త ప్రధాని నియమితులయ్యారు. మొహమ్మద్‌ ముస్తఫాను కొత్త ప్రధానిగా నియమిస్తూ తాజాగా ఆ దేశ అధ్యక్షుడు మహమూద్‌ అబ్బాస్‌ నిర్ణయం తీసుకున్నారు. ముస్తఫా చాలాకాలంగా అధ్యక్షుడు అబ్బాస్‌ వద్ద సలహాదారునిగా పని చేస్తున్నారు.

పాకిస్తాన్‌ అధ్యక్షుడిగా ఆసిఫ్ అలీ జర్దారీ
పాకిస్తాన్‌ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్‌ పీపుల్స్ పార్టీ(పీపీపీ) నేత అసిఫ్‌ అలీ జర్దారీ ప్రమాణ స్వీకారం చేశారు. జర్దారీ పాక్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టడం ఇది రెండోసారి. జర్దారీ 2008 నుంచి 2013 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు.

సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం
అమెరికా (916 బిలియన్ డాలర్లు), చైనా (296 బిలియన్ డాలర్లు), రష్యా(109 బిలియన్ డాలర్లు) తర్వాత రక్షణ రంగానికి 83.6 బిలియన్ డాలర్లను కేటాయించడం ద్వారా భారత్ 2023లో ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద సైనిక వ్యయం చేసే దేశంగా నిలిచింది.

కాలుష్య నగరంగా ఖాట్మండు
ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్య స్థాయిని కొలిచే ‘వరల్డ్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్-ర్యాంకింగ్’ ప్రకారం ప్రపంచంలోని అనారోగ్యకరమైన వాయు జాబితాలో ఖాట్మండు గాలి అగ్రస్థానంలో ఉంది. న్యూఢిల్లీ, థాయ్‌లాండ్‌లోని చియాంగ్‌మై, వియత్నాంలోని హనోయి, థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ మరియు బంగ్లాదేశ్‌లోని ఢాకా వరుసగా రెండు, మూడు, నాలుగు మరియు ఐదవ స్థానాల్లో ఉన్నాయి.

ఏఐ యాంకర్​కు గ్లోబల్​ మీడియా అవార్డ్​
ఇండియా టుడే గ్రూప్ ఏఐ యాంకర్ సనా గ్లోబల్ మీడియా అవార్డును గెలుచుకుంది. లండన్‌లోని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా అసోసియేషన్ గ్లోబల్ మీడియా అవార్డ్స్‌లో గణనీయమైన విజయాన్ని సాధించింది.

భారత్‌ వృద్ది 7.5 శాతం
భారత ఆర్థిక వ్యవస్థ 2024లో 7.5 శాతం వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక అంచనా వేసింది. గతంలో అంచనా వేసిన వృద్ధి రేటు కంటే 1.2 శాతం పెంచింది. నివేదిక ప్రకారం 2024, 2025లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందే ప్రాంతంగా దక్షిణాసియా నిలుస్తుందని పేర్కొంది.

జీఎస్‌టీ రికార్డు వసూళ్లు
భారత్‌ వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు 2024–25 ఆర్థిక సంవత్సరం తొలి నెల ఏప్రిల్‌లో రికార్డు సృష్టించాయి. సమీక్షా నెల‌లో రూ.2.10 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. ఇప్పటి వరకూ ఈ స్థాయి వసూళ్లు ఇదే తొలిసారి. 2023 ఇదే నెలలో నమోదయిన రూ.1.87 లక్షల కోట్లు ఇప్పటి రికార్డు.

విమానాయాన ఉద్గారాల్లో మూడో స్థానం
2019 లో అంతర్జాతీయ విమానాయాన డాటా ఆధారంగా నార్వేజియన్​ యూనివర్సిటీ ఆఫ్​ సైన్స్​ అండ్​ టెక్నాలజీ పరిశోధనలో విమానాయాన రంగం ద్వారా కార్బన్​ డై ఆక్సైడ్​ ఉద్గారాలు ఎక్కువగా విడుదల చేస్తున్న దేశాల్లో భారత్​ మూడో స్థానంలో నిలిచింది. అమెరికా మొదటి స్థానంలో ఉండగా, చైనా, బ్రిటన్​ రెండో స్థానంలో ఉన్నాయి.

ఎన్​ఆర్​ఐ ఓట్లలో కేరళ టాప్​
ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో ఎన్​ఆర్​ఐ ఓట్లు ఉన్న రాష్ట్రాల్లో కేరళా 74.9శాతంతో టాప్​లో నిలిచింది. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి.

ప్రధానికి భూటాన్​ పురస్కారం
భారత ప్రధాని నరేంద్ర మోదీ భూటాన్‌ అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది డ్రూక్‌ గ్యాల్పో’ను అందుకున్నారు. భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగ్యేల్‌ వాంగ్‌చుక్‌ దీన్ని ప్రదానం చేశారు. పురస్కారాన్ని అందుకున్న తొలి విదేశీ ప్రభుత్వాధినేతగా నిలిచారు. ఈ అవార్డును మోదీకి 2021లోనే ప్రకటించారు.

ఆపరేషన్​ ఇంద్రావతి
క్రిమినల్‌ ముఠాల ఆగడాలతో కరీబియన్‌ దేశమైన హైతీలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నుంచి భారతీయులను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం పొరుగునే ఉన్న డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశానికి తరలించేందుకుగానూ ‘ఆపరేషన్‌ ఇంద్రావతి’ చేపట్టినట్లు విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ తెలిపారు.

ప్రపంచంలోనే అతి పొడవైన సెలా టన్నెల్‌
ప్రపంచంలోనే అత్యంత పొడవైన డబుల్ లేన్ ఆల్ వెదర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఈటానగర్‌ నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఇది సముద్ర మట్టానికి 13వేల అడుగుల ఎత్తులో పర్వతాల మధ్య నిర్మించారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ చైనా సరిహద్దుల్లో ఉంటుంది.

సముద్రయాన్ ప్రాజెక్టు
సముద్రగర్భంలో అన్వేషణ కోసం దేశంలోనే తొలి మానవ సహిత డీప్‌ ఓషియన్‌ మిషన్‌కు సముద్రయాన్‌ అని పేరుపెట్టారు. సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్ల లోతుకు సైంటిస్టులను పంపించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఇందులో భాగంగా ‘మత్స్య6000’ జలాంతర్గామి నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్‌ మాత్రమే ఇలాంటి ప్రాజెక్టులను విజయవంతంగా చేశాయి.

భాషల అనువాదానికి భాషిణి
కేంద్ర ప్రభుత్వం ‘భాషిణి’ పేరుతో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత యాప్‌ను అభివృద్ధి చేసింది. ఇది ఒక భారతీయ భాషను మరో భాషలోకి, అదే విధంగా ఇంగ్లీష్‌ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తుంది.

ఆర్‌బీఐ ఉద్గమ్‌ పోర్టల్‌
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్​బీఐ) 30 బ్యాంకులతో కలిసి ఉద్గమ్ పోర్టల్‌ను ప్రారంభించింది.ఈ పోర్టల్ ద్వారా కస్టమర్లు వివిధ బ్యాంకుల్లో ఉండిపోయిన తమ అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్లు/ఖాతాల వివరాలను తెలుసుకోవచ్చు. 2023 మార్చి ఆఖరు నాటికి క్లెయిమ్ చేయని డిపాజిట్ల పరిమాణం రూ. 42,270 కోట్లుగా ఉంది.

ప్రాంతీయం

‘టీ-సేఫ్‌’.. యాప్‌ ఆవిష్కరణ
తెలంగాణ మహిళా భద్రత విభాగం కోసం పోలీసులు రూపొందించిన ‘టీ-సేఫ్‌’ యాప్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు ఇది ఉపయోగపడుతుంది.

ఏఎస్​ఆర్​టీయూ చైర్మన్​గా సజ్జనార్​
అసోసియేషన్‌ ఆఫ్‌ స్టేట్‌ రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్స్‌ (ఏఎస్​ఆర్​టీయూ) స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ఏకగ్రీవంగా నియామకమయ్యారు.

వార్తల్లో వ్యక్తులు

సదానంద్ వసంత్ దాటే
నేషనల్​ ఇన్వెష్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్​ఐఏ) నూతన డైరెక్టర్​ జనరల్​గా సదానంద్ వసంత్ దాటే నియమితులయ్యారు. డిసెంబరు 31, 2026 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్ అధికారి సదానంద్​ ముంబయి 26/11 ఉగ్రదాడి నిందితులు అజ్మల్‌ కసబ్‌, అబు ఇస్మాయిల్‌లను కట్టడి చేయడంలో కీలకంగా వ్యవహరించారు.

శరత్ కమల్
పారిస్ ఒలింపిక్స్‌ ఓపెనింగ్ సెర్మనీలో భారత బృందాన్ని స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారుడు శరత్ కమల్ నడపించనున్నాడు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) గురువారం శరత్‌ను ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసింది. అలాగే, దిగ్గజ బాక్సర్, 2012 ఒలింపిక్ బ్రాంజ్ మెడలిస్ట్ మేరీకోమ్‌‌కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను ‘చెఫ్ డి మిషన్’గా నియమించింది.

లియో వరాద్కర్
భారత సంతతికి చెందిన ఐర్లాండ్ ప్రధానమంత్రి లియో వరాద్కర్ తన పదవికి రాజీనామా చేశారు. రాద్కర్‌ తండ్రిది భారత్‌లోని ముంబయి కాగా, తల్లి ఐర్లాండ్‌ దేశస్థురాలు. వరాద్కర్‌ దేశంలోనే తొలి ‘గే’ ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు.

రాహుల్‌సింగ్‌
సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) చైర్‌పర్సన్‌గా రాహుల్‌సింగ్‌ను కేంద్రం నియమించింది. ఆయన 1996 బ్యాచ్‌ బీహార్‌ క్యాడర్‌ ఐఏఎస్‌అధికారి. రాహుల్‌ ప్రస్తుతం డీఓపీటీ అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. రాహుల్‌ స్థానంలో ఏపీ దాస్‌ జోషీని డీఓపీటీ అదనపు కార్యదర్శిగా కేంద్రం నియమించింది.

పంకజ్‌ అడ్వాణీ
భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్‌ అడ్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. చైనాలోని షాంగ్రావో నగరంలో ఉన్న ప్రపంచ బిలియర్డ్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ మ్యూజియంలో పంకజ్‌ చోటు దక్కించుకున్నాడు. ఇటీవల బిలియర్డ్స్‌ లాంగ్‌ఫార్మాట్‌ టోర్నీలో సహచరుడు సౌరభ్‌ కొఠారిని ఓడించి అడ్వాణీ 26వ ప్రపంచ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పంకజ్‌ ఖాతాలో 18 బిలియర్డ్స్, 8 స్నూకర్‌ ప్రపంచ టైటిళ్లు ఉన్నాయి.

యశస్వి జైస్వాల్‌
భారత యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ ఫిబ్రవరి నెల ఐసీసీ మేటి ఆటగాడి అవార్డు గెలుచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో 712 పరుగులు సాధించిన యశస్వి.. కేన్‌ విలియమ్సన్‌ (న్యూజిలాండ్‌), పతుమ్‌ నిశాంక (శ్రీలంక)లను వెనక్కినెట్టి ఈ అవార్డు సాధించాడు. అయిదు మ్యాచ్‌ల సిరీస్‌లో యశస్వి రెండు డబుల్‌ సెంచరీలు, 3 అర్ధ శతకాలతో సత్తాచాటాడు.

హుస్సేన్ నాయక్
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా బీజేపీ ఎస్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్, జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా వడ్డేపల్లి రాంచందర్ ను నియమిస్తూ రాష్ట్రపతి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.

రికెన్ యమమోటో
ప్రముఖ జపనీస్ ఆర్కిటెక్ట్ రికెన్ యమమోటో 2024 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్‌ని గెలుచుకున్నారు. ఈ అవార్డు ఆర్కిటెక్చర్ రంగంలో అత్యున్నత గౌరవంగా పరిగణించబడుతుంది.1979లో జేఏ ప్రిట్జ్‌కర్, అతని భార్య సిండి స్థాపించిన ప్రిట్జ్‌కర్ ఆర్కిటెక్చర్ ప్రైజ్ అనేది ఒక సజీవ వాస్తుశిల్పికి ప్రతి సంవత్సరం అందించబడే పురస్కారం.

నైమా ఖాతూన్‌
అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) వైస్‌చాన్సలర్‌(వీసీ)గా నైమా ఖాతూన్‌ నియమితులయ్యారు. వర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఆమె ఘనత సాధించారు.1875లో ఏర్పాటైన ముహమ్మదన్‌ ఆంగ్లో ఓరియెంటల్‌ కాలేజీ…1920 లో ‘అలీగఢ్‌ ముస్లిం యూనివర్సిటీ’గా మారింది.

ప్రబోవో సుబియాంతో
ఇండోనేసియా నూతన అధ్యక్షుడిగా ప్రబోవో సుబియాంతో ఎన్నికైనట్లు ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆయన ఈ ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టనున్నారు. సుబియాంతో ప్రస్తుతం ఇండోనేసియా రక్షణ మంత్రిగా ఉన్నారు.

స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్‌ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్‌జీ మహారాజ్‌ ఎన్నికయ్యారు. గత నెలలో కోల్‌కతాలో మరణించిన మఠం అధ్యక్షుడు స్వామి స్మరణానందజీ మహారాజ్‌ వారసుడిగా గౌతమానంద్‌జీ బాధ్యతలు చేపట్టారు. మఠానికి సంబంధించిన ట్రస్టీల బోర్డు 95 ఏళ్ల గౌతమానంద్‌జీని నూతన అధ్యక్షుడిగా ఎన్నుకుంది.

సునీతా విలియమ్స్‌
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌ మూడోసారి అంతరిక్షయానం చేయనున్నారు. ఈసారి ఆమెతో పాటు బట్చ్‌ విల్మోర్‌ వెళ్లనున్నారు. వారం రోజులు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో ఉంటారు. వారిద్దరూ బోయింగ్‌ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో మే 6న నింగిలోకి పయనం కానున్నారు.

స్పోర్ట్స్​

జాతీయ మహిళల హాకీ చాంపియన్​
జాతీయ సీనియర్‌ మహిళల హాకీ చాంపియన్‌షిప్‌ను హర్యానా సొంతం చేసుకుంది. ఫైనల్లో షూటౌట్‌ ద్వారా హర్యానా 3–0తో ఆతిథ్య మహారాష్ట్రను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు 1–1 గోల్స్‌తో సమంగా నిలివడంతో షూటౌట్​ ద్వారా హర్యానా చాంపియన్​గా నిలిచింది.

ఇండియన్‌ వెల్స్‌ మాస్టర్స్‌ సిరీస్‌
కాలిఫోర్నియాలో జరిగిన డియన్ వెల్స్ ఓపెన్ మాస్టర్స్ 1000 టోర్నీలో పురుషుల స్పెయిన్‌కు చెందిన కార్లోస్ అల్కరాజ్​ ఫైనల్లో డానిల్ మెద్వెదెవ్ (రష్యా) ను ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు. మహిళల సింగిల్స్​లో పోలాండ్‌కు చెందిన ఇగా స్వియాటెక్ ఫైనల్లో మరియా సాకరి (గ్రీస్) ను ఓడించి టైటిల్ ను గెలుచుకుంది.

జ్యోతి సురేఖ కెరీర్‌ బెస్ట్‌ ర్యాంక్‌
ఇండియన్​ స్టార్​ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌ ఆర్చరీ స్టేజ్‌–1 టోర్నీలో మూడు గోల్డ్​ మెడల్స్​ సాధించడంతో పాటు తన కెరీర్​లో అత్యుత్తమంగా కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో 299 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

ఇస్రో ‘పుష్పక్‌’ సక్సెస్​
అంతరిక్షంలోకి ఉపగ్రహాలను ప్రయోగించిన వాహక నౌకలను మళ్లీ వినియోగించే ప్రక్రియలో ఇస్రో తయారు చేసిన ‘రీయూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌’ అటానమస్‌ ల్యాండింగ్‌ ప్రయోగం విజయవంతం అయింది. రెక్కలతో తయారు చేసిన ఈ ఆర్‌ఎల్‌వీకి ఇస్రో ‘పుష్పక్‌’ అని పేరు పెట్టారు.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మే​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మార్చి​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఫిబ్రవరి​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జనవరి​ 2024

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!