తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీలో 3,000 ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు సంస్థ ఎండీ సజ్జనార్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించారు. బస్సుల్లో సిబ్బంది కొరత లేకుండా 3 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఆర్టీసీ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించింది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే భర్తీ ప్రక్రియ చేపట్టేందుకు సన్నద్ధమైంది. మహిళలకు ఉచిత బస్ టికెట్ పథకం అయిన మహాలక్ష్మి పథకం అమలుకు ముందు రోజుకు 45 లక్షల మంది ప్రయాణిస్తే, పథకం అమలు తర్వాత రోజుకు 55 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. త్వరలోనే 2,000 డీజిల్ బస్సులు, 990 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ సిద్దపడింది.
అందుకే పెరిగిన అవసరాలకు అనుగుణంగా కొత్తగా 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్ల నియామకానికి ఆర్టీసీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అన్ని నియామకాలు ఒకేసారి చేపట్టవద్దని ఆర్థికశాఖ ఆర్టీసీకి మౌఖికంగా సూచించినట్లు తెలిసింది. దీంతో ప్రస్తుతం 3 వేల పోస్టుల భర్తీకి సవరించిన ప్రతిపాదనలు పంపించింది. ప్రతిపాదించింది. ఇందులో 2 వేల డ్రైవర్ పోస్టులు ఉండగా శ్రామిక్‌లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి పోస్టులు ఉన్నాయి. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇస్తే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఈ నియామకాల ప్రక్రియ చేపడుతారు.