Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS1520 MPHA (Female) పోస్టులకు నోటిఫికేషన్

1520 MPHA (Female) పోస్టులకు నోటిఫికేషన్

తెలంగాణలో 1520 మల్టీ పర్పస్​ హెల్త్ అసిస్టెంట్​ (ఫిమేల్​) పోస్టులకు నోటిఫికేషన్​ వెలువడింది. మెడికల్​ హెల్త్ సర్వీసెస్​ రిక్రూట్​మెంట్​ బోర్డు ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్ట్ 25వ తేదీ నుంచి ఆన్​లైన్లో అప్లై చేసుకోవాలని సూచించింది. సెప్టెంబర్​ 19వ తేదీ వరకు అప్లికేషన్లకు తుది గడువుగా ప్రకటించింది.

Advertisement

ఎంపీహెచ్​ఏ ట్రైనింగ్​ కోర్సు పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అభ్యర్థులు తెలంగాణ స్టేట్​ నర్సెస్​ అండ్​ మిడ్​ వైవ్స్​ కౌన్సిల్​ లో రిజిష్టేషన్​ చేసుకొని ఉండాలి. లేదా ఇంటర్​ వొకేషనల్ (ఎంపీహెచ్​ఏ)​ కోర్సు పూర్తి చేసి ఏడాది పాటు గుర్తింపు పొందిన హాస్పిటళ్లలో అప్రెంటిష్​షిప్​ చేసిన అనుభవం ఉండాలి. తెలంగాణ పారామెడికల్​ బోర్డులో రిజిస్టర్​ చేసుకోవాలి. 18 ఏళ్ల వయస్సు నుంచి గరిష్ఠంగా 44 ఏళ్లకు మించని వారందరూ ఈ పోస్టులకు అర్హులవుతారు.

రిక్రూట్​మెంట్​ ఎగ్జామ్​లో వచ్చే మార్కులకు 80 పాయింట్లు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేసిన సేవల అనుభవానికి 20 పాయింట్లు కేటాయిస్తారు. వీటితో పాటు నిబంధనల ప్రకారం రిజర్వేషన్ల​ కోటాను పరిగణనలోకి తీసుకొని పోస్టులను భర్తీ చేస్తారు. ఈ పరీక్ష ఇంగ్లిష్​లో ఉంటుంది. హైదరాబాద్​, వరంగల్​, ఖమ్మం, నిజామాబాద్​ లో పరీక్ష కేంద్రాలుంటాయి. పరీక్ష తేదీలను త్వరలో ప్రకటిస్తారు. పరీక్ష సిలబస్​, జోన్ల వారీగా పోస్టుల ఖాళీల వివరాలను ఇక్కడ అందిస్తున్నాం. దీంతో పాటు డిటైయిల్డ్ నోటిఫికేషన్​ పీడీఎఫ్​ కూడా దిగువన ఉంది.

జోన్ల వారీగా ఖాళీల వివరాలు

పేపర్​ సిలబస్​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!