HomeLATEST1261 ఉద్యోగాలకు నోటిఫికేషన్

1261 ఉద్యోగాలకు నోటిఫికేషన్

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు మరో భారీ గుడ్ న్యూస్ చెప్పింది. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (UPSC CMS-2023) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1261 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే ఏప్రిల్ 19 నుంచి ప్రారంభమైంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 9ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  1. మెడికల్ ఆఫీసర్ (సెంట్రల్ హెల్త్ సర్వీస్)-584
  2. రైల్వేలో అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్-300
  3. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌లో జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్-1
  4. ఢిల్లీ జనరల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-II-376
    మొత్తం పోస్టుల సంఖ్య: 1261

విద్యార్హత:
అభ్యర్థులు ఎంబీబీఎస్ పాసై ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. ఆగస్ట్ 1, 2023 నాటికి వారి వయోపరిమితి 32 ఏళ్లు మించకూడదు. వివిధ వర్గాల వారికి వయో పరిమితిలో సడలింపు ఉంటుంది. ఆ వివరాలను సైతం నోటిఫికేషన్లో చూడొచ్చు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!