HomeLATESTఆ పరీక్షకు 50 శాతంలోపే హాజరు.. ఓ అభ్యర్థిపై కేసు.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన..

ఆ పరీక్షకు 50 శాతంలోపే హాజరు.. ఓ అభ్యర్థిపై కేసు.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన..

మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డవలప్మెంట్ డిపార్ట్మెంట్ లో అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ అండ్ సీనియర్ అకౌంట్ ఉద్యోగాలకు సంబంధించిన నియామక పరీక్షను ఈ రోజు అంటే.. ఆగస్టు 8న నిర్వహించింది తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC). కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ (CBRT) విధానంలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం 26,548 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. అయితే.. ఉదయం జరిగిన పేపర్-1 పరీక్షకు 12,286(46.28%), మధ్యాహ్నం జరిగిన పేపర్-2 పరీక్షకు 12,302(46.30%) మంది పరీక్షకు హాజరయ్యారు.

Advertisement

ఈ రెండు పరీక్షలకు కూడా 50 శాతం లోపే అభ్యర్థులు హాజరుకావడం గమనార్హం. ఇదిలా ఉంటే.. మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో మధ్యహ్నం పరీక్షకు హాజరైన ఓ అభ్యర్థి పరీక్ష ముగియక ముందే మధ్యలోనే కేంద్రం నుంచి బయటకు వెళ్లాడు. నిబంధనలకు విరుద్ధంగా పరీక్ష మధ్యలోనే బయటకు వెళ్లిన ఆ అభ్యర్థిపై మాల్ ప్రాక్టీస్ కేసును నమోదు చేసినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటనలో పేర్కొంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!