తెలంగాణ పోలీసు శాఖలో 15,644, రవాణా శాఖలో 63, ఆబ్కారీ శాఖలో 614 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 30వ తేదీన ఇందికు సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించారు. ఇందులో సివిల్ కానిస్టేబుల్ పరీక్షలో మొత్తం 1,09,663 మంది అర్హత సాధించగా.. దీనిలో 1,08,055 మంది పరీక్షకు హాజరయ్యారు. 98.53 శాతం మంది పరీక్ష రాశారు. పీసీ ఐటీ పోలీస్ పరీక్షకు 6,801 మంది అర్హత సాధించగా దీనిలో 6,088 మంది పరీక్ష రాశారు. 89.52 శాతం మంది ఈ పరీక్ష రాశారు.
అభ్యర్థులు పరీక్షలు కీ, ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైమరీ కీపై బోర్డు కీలక ప్రకటన చేసింది. మే 22న.. కానిస్టేబుల్ ప్రైమరీ కీని వెబ్ సైట్లో https://www.tslprb.in/ అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించింది. కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. మే 24వ తేదీ వరకు తగిన ధ్రువపత్రాలతో తమ అభ్యంతరాలను వ్యక్తిగత లాగిన్ ద్వారా సమర్పించాలని బోర్డు సూచించింది.