కొన్ని నెలలుగా తెలంగాణలో లక్షలాది మంది అభ్యర్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న టీఎస్‌పీఎస్సీ ఈ సెట్, లా సెట్, పీజీ లా సెట్ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 14న ఈ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ నెల 15 నుండి ఏప్రిల్ 16 వరకు దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు. మే 6న ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించనున్నారు.
లాసెట్- షెడ్యూల్ విడుదల
తెలంగాణ ఉన్నత విద్యా మండలి 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు, ఐదేళ్ల టీఎస్ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ లాసెట్-2024), టీఎస్ పీజీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పీజీఎల్‌సెట్-2024) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ పరీక్షను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది.
అర్హత: మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే అభ్యర్థులు ఏదేని విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసి ఉండాలి. వీరు బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీకామ్+ఎల్‌ఎల్‌బీ, బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్సీ+ఎల్‌ఎల్‌బీ చేసే అవకాశం ఉంది. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష జూన్ 3న నిర్వహించనున్నారు.