టీచర్ ఉద్యోగాలే (Telangana Teacher Jobs) లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న లక్షలాది మంది నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బీసీ సంక్షేమ శాఖలో.. మహాత్మా జ్యోతి బా ఫూలే బి.సి వెల్ఫేర్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో మొత్తం 2591 నూతన ఉద్యోగాల నియామకాలకు ఈ రోజు జరిగిన మంత్రి వర్గ సమావేశం ఆమోదం తెలిపింది. ఈ విద్యా సంవత్సరంలో నూతనంగా ప్రారంభించిన 4 జూనియర్ కాలేజీలు, 15 డిగ్రీ కాలేజీలు, 33 రెసిడెన్షియల్ పాఠశాలలల్లో టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ విభాగాల్లో, అవసరమైన మేరకు ఈ నూతన నియామకాలను చేపట్టాలని కేబినెట్ అధికారులను ఆదేశించింది.
Read This: ఆ శాఖలో మరో 472 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్
ఈ నేపథ్యంలో త్వరలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే గురుకుల పాఠశాలలకు సంబంధించి 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ఆమోదం లభించింది. ఈ నెలలోనే ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో లక్షలాది మంది నిరుద్యోగులు పుస్తకాల బాట పట్టారు. ఈ రోజు జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరో 2591 నియామకాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఖాళీల సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.