నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అదిరిపోయే శుభవార్త చెప్పింది. కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్-2023ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పరిధి లోని వివిధ మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్ బీ,సీ పోస్టులని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్ అఫీసర్ తో పాటు మొత్తం 36 కేటగిరీల్లోని 7,500 ఖాళీల భర్తీని ఈ ప్రకటన ద్వారా చేపట్టింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఏప్రిల్ 3 నుంచే ప్రారంభించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు మే 3వ తేదీ వరకు తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులు ప్రారంభం: ఏప్రిల్ 3
దరఖాస్తు చేసుకోవడానికి ఆఖరి తేదీ: మే 3
ఆన్లైన్లో దరఖాస్తు ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ: మే 4
అప్లికేషన్ ఫామ్ కరెక్షన్: మే 7 నుంచి 8వ తేదీ వరకు..
టైర్-1 పరీక్ష: జులై 2023
టైర్-2: తర్వాత ప్రకటిస్తారు.
అధికారిక వెబ్ సైట్: https://ssc.nic.in/