HomeLATESTపోటీ పరీక్షలకు నోబెల్ బహుమతులు..ముఖ్యమైన బిట్స్

పోటీ పరీక్షలకు నోబెల్ బహుమతులు..ముఖ్యమైన బిట్స్

నోబెల్ బహుమతులు-2023 

1. వైద్య శాస్త్రం – 2 అక్టోబర్ 2023 – కాటలిన్‌ కరికో(హంగేరీ), డ్రూ వెయిస్‌మన్‌( అమెరికా) – న్యూక్లియోసైడ్‌ బేస్‌ మాడిఫికేషన్లలో వీరు చేసిన ఆవిష్కరణలకు, కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థవంతమైన ఎంఆర్‌ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA Vaccine) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినందుకు వీరికి ఈ పురస్కారం ల‌భించింది.  

Advertisement

2. భౌతిక శాస్త్రం – 3 అక్టోబర్ 2023 – పెర్రీ అగోస్తిని(అమెరికా), ఫెరెన్స్‌ క్రౌజ్‌(జర్మనీ), అన్నె ఎల్‌ హ్యులియర్‌(స్వీడన్‌) – ఒక పదార్ధంలోని ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లను అధ్యయనం చేసేందుకు ఆటోసెకెండ్‌ పల్స్‌ను ఉత్పత్తి చేసే ప్రయోగాలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది.  

3. రసాయన శాస్త్రం– 4 అక్టోబర్ 2023 – మౌంగి జి. బావెండి(అమెరికా), లూయిస్ ఇ. బ్రస్(అమెరికా), అలెక్సీ ఐ. ఎకిమోవ్‌(అమెరికా) – నానోటెక్నాలజీకి సంబంధించి క్వాంటమ్‌ డాట్స్‌ ఆవిష్కరణలో  చేసిన పరిశోధనలకుగాను వీరికి ఈ పురస్కారం ల‌భించింది. 

4. సాహిత్యం – 5 అక్టోబర్ 2023 – జాన్‌ ఫోసె(నార్వే) – మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు జాన్‌ వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని నోబెల్‌ పురస్కారాన్ని ప్ర‌క‌టించారు.

Advertisement

5. శాంతి –  6 అక్టోబర్ 2023 – న‌ర్గిస్‌ మొహమ్మది (ఇరాన్‌ ) – ఇరాన్‌ మహిళల హక్కులు, స్వేచ్చపై పోరాటం చేసినందుకు గాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది. 

6. ఆర్థిక శాస్త్రం – 9 అక్టోబర్ 2023 – క్లాడియా గోల్డిన్‌(అమెరికా) – లేబర్‌ మార్కెట్‌లో మహిళల ప్రాతినిధ్యంతో వచ్చే ఫలితాలపై అధ్యయనానికి విశేష కృషి చేసినందుకుగాను ఈమెకు ఈ పురస్కారం ల‌భించింది.  

 • నోబెల్ బహుమతులను ప్రతి ఏటా 5 రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రదానం చేస్తారు. ఈ సాంప్రదాయం 1901 నుంచి ప్రారంభమైంది.
 • స్వీడన్ దేశంలో అందించే ఈ పురస్కారం ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి పొందింది. అయితే 1968 స్వీడన్ సెంట్రల్ బ్యాంకు అల్ఫ్రెడ్ నోబెల్ గౌరవార్థం ఆర్థికరంగంలో కూడా నోబెల్ బహుమతిని ఇవ్వాలని తీర్మానించింది. ఇందులో భాగంగా నోబెల్ ఫౌండేషన్ కు విరాళం సైతం అందించింది.
 • 1960 నుంచి కూడా ఆర్థికరంగంలో సైతం నోబెల్ బహుమతి అందిస్తున్నారు. అలా మొత్తం 6 రంగాలు అంటే భౌతిక, రసాయన, వైద్య, సాహిత్య, శాంతి, ఆర్ధిక రంగాల్లోని నిపుణులకు నోబెల్ బహుమతులను ప్రతి ఏటా అందిస్తున్నారు.
 • ఆయా రంగాల్లో ‘గడిచిన ఏడాది కాలంలో ప్రపంచ మానవాళికి వారి పరిశోధనల ద్వారా ఏమి విశేష ప్రయోజనం చేకూరిందో నిరూపించాల్సి ఉంటుంది.

Advertisement
 • ఏదైనా ఒక పరిశోధనకు గానీ, లేదా రెండు పరిశోధనలకు కలిపి ఒక రంగంలో నోబెల్ బహుమతి ఇవ్వొచ్చు. అయితే ముగ్గురికి మించి వ్యక్తులు నోబెల్ బహుమతిని పంచుకోలేరు. కానీ నోబెల్ శాంతి బహుమతిని మాత్రం సంస్థలకు సైతం అందిస్తారు. సంస్థల విషయంలో ముగ్గురు వ్యక్తులకు కలిపి బహుమతి ఇవ్వకూడదు అనే నిబంధన వర్తించదు.
 • అయితే పురస్కారాల మాదిరిగా మరణానంతర నోబెల్ బహుమతి ఇవ్వరు. అయితే బహుమతి ప్రకటన తర్వాత స్వీకరణ సమయంలోగా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఈ పురస్కారం ఇస్తారు.
 • భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్య రంగాల్లో ఆవిష్కరణలకు సంబంధించి నోబెల్ బహుమతి అందించేందుకు సుదీర్ఘ కాలం పడుతుంది. అందరి ఆమోదం పొందిన తర్వాతే అందిస్తారు. ఒక్కోసారి దీనికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకూ పరిశోధకులు జీవించి ఉండాల్సి ఉంటుంది.
 • భౌతికశాస్త్రంలో సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ 1930ల్లో ఆవిష్కరించిన ‘Stellar Structure and Evolution’ అనే సిద్ధాంతానికి 1989లో నోబెల్ బహుమతిని ప్రకటించారు.
 • సాహిత్యం, అలాగే శాంతికి సంబంధించిన రంగాల్లో సాధారణంగా జీవితకాల కృషిని గుర్తించి నోబెల్ బహుమతి ఇస్తారు. అయితే కొన్నిసార్లు ఏదో ఒక ప్రత్యేక అంశంపై కూడా ఇవ్వవచ్చు. ఉదాహరణకు ఆమెరికా ప్రెసిడెంట్ గా కేవలం ఒక్క ఏడాది పూర్తిచేసుకున్న ఒబామాకు శాంతి బహుమతి లభించింది.
 • సాధారణంగా నోబెల్ బహుమతి ప్రకటించే వరకూ విజేతల వివరాలను కమిటీ అత్యంత గోప్యంగా ఉంచుతుంది. ఇక ఆయా రంగాల్లో బహుమతి కోసం ఎంత మంది నామినేట్ అయ్యారు అనే విషయం మాత్రం దాదాపు 50 సంవత్సరాల పాటు గోప్యంగా ఉంచుతారు.

 • నోబెల్ పురస్కారంలో ఒక బంగారు మెడల్, డిప్లొమా, నగదు బహుమతి ఉంటాయి. మెడల్ ను 18 క్యారెట్ల గ్రీన్ గోల్డ్ తో తయారు చేసి, 24 కారెట్లు బంగారంతో పూత పోస్తారు.
 • -కమిటీ అందించే డిప్లొమాలో స్వీడిష్ భాషలో గ్రహీత పేరు రాస్తారు. అంతేకాదు పురస్కారంతో పాటు ఎంత బహుమతి లభించిందో కూడా అందులో రాసి ఉంటుంది.
 • నోబెల్ శాంతి బహుమతి డిప్లొమాలో ఎందుకు వచ్చిందనే కారణం రాసి ఉండదు.
 • ఇదిలా ఉంటే గతంలో నోబెల్ బహమతి సందర్భంగా అందించే నగదు బహుమతి -పది మిలియన్ స్వీడిష్ క్రోనర్లు ఉండగా, ఈ ఏడాది నుంచి 11 మిలియన్ స్వీడిష్ క్రోనర్లకు పెంచుతూ కమిటీ నిర్ణయం తీసుకుంది.
 • స్వీడిష్ కరెన్సీ విలువపడిపోతున్న నేపథ్యంలో బహుమతి మొత్తాన్ని పెంచడం జరిగిందని నోబెల్ కమిటీ ఇటీవల ప్రకటించింది.
 • 2012లో బహుమతిని 8 మిలియన్ క్రోనర్లకు తగ్గించిన సందర్భాలూ ఉన్నాయి. బహుమతిని ఇద్దరూ లేదా ముగ్గురు పంచుకుంటున్నప్పుడు నగదు బహుమతి వారి మధ్య సమానంగా పంచుతారు.

 • రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్- రసాయన, భౌతిక, ఆర్థిక రంగాల్లో ఎంపిక చేస్తుంది.
 • కరోలిన్ స్కా ఇన్స్టిట్యూట్లోని నోబెల్ అసెంబ్లీ- వైద్యరంగంలొ ఎంపిక చేస్తుంది.
 • స్వీడిష్ అకాడమీ – సాహిత్యరంగం ఎంపిక చేస్తుంది.
 • నార్వేజియన్ నోబెల్ కమిటీ – నోబెల్ శాంతి బహుమతుల ప్రకటన చేసింది.
 • నోబెల్ బహుమతులను అక్టోబర్ నెలలో ప్రకటిస్తారు. ముందుగా వైద్యరంగంలో, ఆ తరవాత భౌతిక, రసాయన, సాహిత్య, శాంతి, ఆర్థిక రంగాల్లో వరుసగా ప్రకటిస్తారు.
 • నోబెల్ బహుమతుల ప్రదానం అల్ ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజున డిసెంబరు 10న రెండు ప్రదేశాల్లో జరుగుతుంది.
 • ఒక్క శాంతి బహుమతి మిసహా మిగతా నోబెల్ బహుమతులన్నీ స్వీడన్లోని స్టాక్ హోం నగరంలో ‘స్టాక్ హోం కాన్సర్ట్ హాల్’లో ‘స్వీడన్ రాజు చేతుల మీదుగా ప్రదానం చేస్తారు.
 • నోబెల్ శాంతి బహుమతిని నార్వే దేశంలోని ఓస్లో నగరంలో గల కుస్లో సిటీ హాల్లో నార్వే రాజు, రాచ కుటుంబీకుల సమక్షంలో నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ ప్రదానం చేస్తారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!