దేశంలోని వివిధ కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీ ఆర్క్) కోర్సుల్లో అడ్మిషన్స్ పొందడానికి నిర్వహించే నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్(నాటా) మొదటి విడత నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ లో మే 23వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 12 వ తేదీన ఎగ్జామ్ నిర్వహించనున్నారు. పరీక్షలో 125 ప్రశ్నలు ఇస్తారు, మొత్తం 200 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది.
మూడు విడతల్లో ఎగ్జామ్
ఈ సారి నాటా నోటిఫికేషన్ మూడు విడతల్లో జరగనుంది. ఇప్పుడు మొదటి విడత నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. రెండో విడత జూలై 3వ తేదీన, మూడో విడత జూలై 24 వ తేదీన జరగనున్నాయి. పూర్తి సమాచారం కోసం www.nata.in నాటా వెబ్సైట్ సంప్రదించవచ్చు.