నిరుద్యోగులకు ప్రముఖ ఇస్రో (ISRO) సంస్థ శుభవార్త చెప్పింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో ఉద్యోగాల (Central Government Jobs) భర్తీకి ప్రకటన విడుదల చేసింది. టెక్నీషియన్-ఎ, డ్రాట్స్‌మన్-బి, రేడియోగ్రాఫర్-ఎ విభాగాల్లో 49 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఈ రోజు అంటే.. మే 4న ప్రారంభం కానుంది.
దరఖాస్తు చేసుకోవడానికి మే 18ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ISRO అధికారిక వెబ్సైట్ vssc.gov.in లేదా isro.gov.inలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
విద్యార్హతలు:
అభ్యర్థులు సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి 35 ఏళ్లుగా నిర్ణయించారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.