HomeLATESTగురుకుల జూనియర్​ కాలేజీలో ఇంటర్​లో అడ్మిషన్స్​

గురుకుల జూనియర్​ కాలేజీలో ఇంటర్​లో అడ్మిషన్స్​


తెలంగాణ రాష్ట్రంలోని 35 గురుకుల జూనియర్​ కళాశాలల్లో 2024-–25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్​మొదటి సంవత్సరంలో అడ్మిషన్స్​కు తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ టీఎస్​ఆర్జేసీ సెట్​-2024 నోటిఫికేషన్​ను విడుదల చేసింది.

అర్హత: 2024 మార్చిలో జరుగనున్న పదోతరగతి పరీక్షలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రిజర్వేషన్​ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.


సీట్లు: మొత్తం 2,996 సీట్లలో ఎంపీసీ–1,496, బైపీసీ–1,440, ఎంఈసీ–60 ఖాళీలు అందుబాటులో ఉన్నాయి.
ఎగ్జామ్​ ప్యాటర్న్​: ప్రశ్నపత్రం​ ఆబ్జెక్టివ్‌ విధానంలో మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. విద్యార్థులు ఎంపిక చేసుకునే గ్రూప్​ ఆధారంగా సంబంధిత సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఎంపీసీ పరీక్షకు ఇంగ్లిష్​, మ్యాథ్స్​, ఫిజికల్‌ సైన్స్‌; బైపీసీకి ఇంగ్లిష్​, బయాలజీ.


ఫిజికల్‌ సైన్స్‌; ఎంఈసీ పరీక్షకు ఇంగ్లిష్​, సోషల్​ స్టడీస్​, గణితం సబ్జెక్టుల నుంచి పదోతరగతి స్థాయిలో ఒక్కో సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 2.30 గంటలు. ప్రశ్నపత్రం తెలుగు/ ఇంగ్లిష్‌ మాధ్యమాల్లో ఉంటుంది.


పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లా కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.


దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో మార్చి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. అప్లికేషన్​ ఫీజు రూ. 200 ఉంటుంది. రాతపరీక్ష ఏప్రిల్​ 21న నిర్వహిస్తారు. మొదటి దశ కౌన్సెలింగ్ మే లో ఉంటుంది. పూర్తి వివరాలకు www.tsrjdc.cgg.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!