Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBS80 వేల పోస్టులకు ఉచిత కోచింగ్

80 వేల పోస్టులకు ఉచిత కోచింగ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ( SSC) చేపడుతున్న బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్ పీఎఫ్, ఐటీబీపీ వంటి విభాగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఉద్యోగార్థులకు పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, రాంకీ ఫౌండేషన్ ఫ్రీ శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించాయి. సాయుధ బలగాల నియామకాల్లో భాగంగా కేంద్రం 80వేలకు పైగా ఖాళీలను త్వరలోనే భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి అర్హులైన యువతకు హైదరాబాద్, గుంటూరులో ఆయ ఫౌండేషన్లు నవంబర్ 26న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తాయి. ఫలితాలను 29న ప్రకటిస్తాయి. ఇందులో అర్హత సాధించిన 600మంది అభ్యర్థులకు డిసెంబర్ 2 నుంచి 5 నెలల పాటు వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ ఫ్రీగా ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వనున్నారు. వివరాలకు 9703651233, 7337585959, 9000797789 నెంబర్లను సంప్రదించవచ్చు.

Advertisement

కాగా ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. ఈ పోస్టులకు దరఖాస్తుకునే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ డిసెంబర్ 28వ తేదీతో పూర్తి అవుతుంది. రాత పరీక్ష తేదీలను ఎస్ ఎస్సీ ఈ మధ్యే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్ ను కూడా రిలీజ్ చేసింది. కానిస్టేబుల్ రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20,21,2,2,23,24,26,27,28,29, మార్చి 1,5,6,7,11,12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతాయని వెల్లడించింది.

గతేడాది నవంబర్ లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సాయుధ బలగాల్లో 50వేలకు పైగానే సిపాయి పోస్టులు భర్తీ చేశారు. ఈ ఏడాది కూడా అంత కంటే ఎక్కువ సంఖ్యలో పోస్టులు భర్తీ కానున్నాయి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!