బ్యాంకు ఉద్యోగమే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్న ఉద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో పలు స్పెషలిస్టు కేటగిరిల కింద పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ పోస్టులకు అభ్యర్థులు ఆన్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 192 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన అర్హతలు, జీతం, దరఖాస్తు ఫీజు, ముఖ్యతేదీలు, ఇంటర్వ్యూ తేదీ వంటి విషయాలు తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు : 192
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1 పోస్టు
- రిస్క్ మేనేజ్ మెంట్ ఏజీఎం – 1 పోస్టు
- రిస్క్ మేనేజ్ మెంట్ సీఎం – 1 పోస్టు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 06 పోస్టులు
- ఫైనాన్షియల్ అనలిస్ట్ – 05పోస్టులు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ – 73 పోస్టులు
- లా ఆఫీసర్ -15 పోస్టులు
- క్రిడెట్ ఆఫీసర్ -50 పోస్టులు
- ఫైనాన్షియల్ అనలిస్ట్ మేనేజ్ -4 పోస్టులు
- సీఏ ఫైనాన్స్అండ్ అకౌంట్స్ -3 పోస్టులు
- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ -15 పోస్టులు
- సెక్యూరిటీ ఆఫీసర్ -15పోస్టులు
- రిస్క్ మేనేజర్ -2 పోస్టులు
- లైబ్రేరియన్ – 1 పోస్టు
అర్హతలు :
పై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో సీఎ, ఐసీఏఐ, ఐసీడబ్ల్యూఏఐ, సీఎఫ్ఏ, ఏపీఎంఏ, డిగ్రీ డిప్లొమ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపిక విధానం: పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.