భారత సమాచార మంత్రిత్వ శాఖ పరిధిలోని తపాలా శాఖ దేశవ్యాప్తంగా పలు పోస్టల్ సర్కిళ్లలో స్పోర్ట్ కోటా కింద 1899 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్టల్ అసిస్టెంట్ 589 ఖాళీలు, సార్టింగ్ అసిస్టెంట్ 143 ఖాళీలు, పోస్ట్ మ్యాన్ 585 ఖాళీలు, మెయిన్ గార్డ్ 3 ఖాళీలు, ఎంటీఎస్ 570 ఖాళీలు ఉద్యోగాల భర్తీకి అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 1899 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అర్హత ఆసక్తి గల అభ్యర్థుల ఆన్ లైన్ విధానంలో అప్లయ్ చేసుకోవాలి. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను https://dopsportsrecruitment.cept.gov.in/ వెబ్ సైట్లో చూడవచ్చు.
అర్హత: పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా డిగ్రీ, పోస్ట్ మ్యాన్ , మెయిల్ గార్డ్ పోస్టులకు 12వ తరగతి, ఎంటీఎస్ పోస్టులకు 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు పలుస్థాయుల్లో క్రీడాకారులై ఉండాలి.
క్రీడాంశాలు: ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బేస్ బాల్, బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, కబడ్డీ, హాకీ, జూడో, హ్యాండ్ బాల్.
వయస్సు:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 నుంచి 27ఏళ్లు ఉండాలి.
జీతం:
నెలకు పోస్టల్ అసిస్టెంట్ సార్టింగ్ అసిస్టెంట్ రూ. 25,500, రూ. 81,100 పోస్ట్ మ్యాన్ మెయిల్ గార్డుకు 21,700, 69,100 మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కు 18వేలే, రూ. 56900 ఉంటుంది.
ఎంపిక విధానం:
క్రీడా విజయాలు, డాక్యుమెంట్, వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామిషన్ ఆధారంగా సెలక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు
రూ. 100 ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు , ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి సడలింపు ఉంది.
ముఖ్య తేదీలు
ఆన్ లైన్ దరఖాస్తులు – 10.11.2023
చివరి తేదీ 09.12.2023
ఫీజు చివరి తేదీ 09.12. 2023
Super sir
Jogu dilep