HomeLATESTనిరుద్యోగులకు అలర్ట్.. 9,212 ఉద్యోగాలకు ప్రారంభమైన అప్లికేషన్లు.. దరఖాస్తు లింక్ ఇదే

నిరుద్యోగులకు అలర్ట్.. 9,212 ఉద్యోగాలకు ప్రారంభమైన అప్లికేషన్లు.. దరఖాస్తు లింక్ ఇదే

పోలీస్ ఉద్యోగం సాధించాలన్న లక్ష్యంతో ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది సెంట్రల్ హోం మినిస్ట్రీ పరిధిలోని సీఆర్పీఎఫ్ (CRPF). భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9212 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది సంస్థ. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ విభాగాల్లో మొత్తం 9212 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌లో 424, తెలంగాణలో 301 ఖాళీలు ఉన్నాయి.
అధికారిక వెబ్ సైట్https://crpf.gov.in/

Advertisement

మొత్తం కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్ మ్యాన్) ఖాళీలు: 9,212
పురుషులు: 9105
మహిళలు: 107

విద్యార్హత: టెన్త్, ఐటీఐ విద్యార్మత కలిగిన పురుషులు/ మహిళలు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి. పురుషులు 170 సెం.మీ., మహిళలు 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను ఈ నెల 27న ప్రారంభించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 25 వరకు అవకాశం ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఎక్కడైనా విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఎంపికైన వారికి నెలకు రూ.21,700-రూ.69,100 వేతనం ఉంటుంది.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!