HomeLATESTమహారాష్ట్రలో కేసీఆర్ కు ఘన స్వాగతం.. జులై 2న కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి.. తెలంగాణలో...

మహారాష్ట్రలో కేసీఆర్ కు ఘన స్వాగతం.. జులై 2న కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి.. తెలంగాణలో మరో కొత్త మండలం.. నేటి వార్తలు జూన్ 26

మహారాష్ట్రలో కేసీఆర్ కు ఘన స్వాగతం

బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఇవాళ (సోమవారం) మహారాష్ట్రలోని ధారాశివ్, సోలాపూర్ జిల్లాల్లో పర్యటించారు. సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో మహారాష్ట్ర పర్యటన చేపట్టారు. సీఎం కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో కూడిన దాదాపు 600 వాహనాలతో కాన్వాయ్ బయలుదేరింది. దాదాపు 6 కిలోమీటర్ల మేర సీఎం వెంట కాన్వాయ్ సాగింది. ముంబాయి రహదారి మీదుగా ప్రయాణిస్తున్న సీఎం కాన్వాయ్ కు రహదారి పొడుగునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ బీఆర్ఎస్ శ్రేణులు స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ సోలాపూర్ కు బయలుదేరారు.

Advertisement

ఉప్పల్ స్కై వాక్ ను ప్రారంభించిన కేటీఆర్

హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో ఒకటైన ఉప్పల్ చౌరస్తాలో పాదచారులు సులభంగా రోడ్డు దాటడం కోసం హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన స్కై వాక్ ను మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ సిహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు. రోడ్డు దాటే పాదచారుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రజలు అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ ఈ స్కైవాక్‌ను నిర్మించారు. 8 చోట్ల లిఫ్ట్‌లు, 4 ఎస్కలేటర్స్‌, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు.

జులై 2న కాంగ్రెస్ లోకి పొంగులేటి, జూపల్లి

మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వచ్చే నెల 2న కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ మేరకు ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఆ సభకు రావాలని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన భేటీలో పొంగులేటి, జూపల్లితోపాటు దాదాపు 150 మంది నాయకులు రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. ఇందులో ఎక్కువ మంది బీఆర్ఎస్ కు చెందిన వారే ఉండటం గమనార్హం. ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలు టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, చిన్నా రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, మల్లు రవి, సంపత్, వంశీ చంద్ రెడ్డి, బలరాం నాయక్, రేణుకా చౌదరి, సీతక్క తదితరులు కూడా హాజరయ్యారు.

కేసీఆర్ సర్కార్ ఇంటికి: భట్టి

కేసీఆర్ సర్కార్​ను ఇంటికి పంపేందుకు ప్రజలు రెడీగా ఉండాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రజలకు పిలపునిచ్చారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం కొండలరాయిని గూడెం, మున్యా నాయక్ తండా, కర్వి నాగారం, రావి తండా , పాండ్యా నాయక్ తండాల్లో ఆయన పర్యటించారు. ఈసందర్భంగా భట్టి గిరిజనులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అడవిలో పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలకు భూమిపై హక్కులు లేకుండా, ఫలసాయం అందకుండా, ఆత్మ గౌరవం లేకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం రకరకాల హింసలకు గురి చేసిందని ధ్వజమెత్తారు. దీనికి బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ పార్టీ తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.

Advertisement

తెలంగాణ సొమ్ముతో కేసీఆర్ పర్యటన: షర్మిల

సీఎం కేసీఆర్ ​మహారాష్ట్ర పర్యటనపై వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విరుచుకుపడ్డారు. ‘మంది సొమ్ము ముప్పొద్దులా మెక్కే ముదనష్ఠపు స్వభావం ఎవరికైనా ఉంది అంటే, అది మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన అవినీతి చెంచాలు అని చెప్పుకోవాలి. అసలు ప్రజల రక్తాన్ని, కష్టాన్ని ఎంతగా పీక్కుతినాలో వీరి నుంచి నేర్చుకోవాలి. సీఎం గారు, మీ దిక్కుమాలిన దేశ రాజకీయాల కోసం తెలంగాణ డబ్బును ఎంత నిస్సిగ్గుగా వాడుతున్నారో అసలు సోయి ఉన్నదా మీకు? మహారాష్ట్రలో అచ్చోసిన ఆంబోతుల్లాగా తిరుగుతున్న బీఆర్ఎస్​ఎమ్యెల్యేలు, ఆ ఖర్చులను తెలంగాణ ఖాతాలో జమచేస్తరా?’ అని షర్మిల ట్వీట్ చేశారు.

తెలంగాణలో మరో కొత్త మండలం

జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. బండలింగాపూర్‌ గ్రామం మండల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. మెట్‌పల్లిలోని పది గ్రామాలతో బండలింగాపూర్‌ మండలంగా ప్రతిపాదించింది. 15 రోజుల్లో అభ్యంతరాలు, వినతులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 18 ఉండగా.. 380 గ్రామాలున్నాయి. మరో వైపు సంగారెడ్డి నుంచి కామారెడ్డి జిల్లాకు బాబుల్‌గాం గ్రామాన్ని బదలాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

నల్లగొండలో ఘోర ప్రమాదం

నల్లగొండలోని బర్కత్ పురా కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజీలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. దీంతో అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలై చనిపోయారు. మృతులను కోల్డ్ స్టోరేజీ ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ గా గుర్తించారు. మరో నలుగురు వ్యక్తులు స్టోరీజీ పేలుడు నుంచి తప్పించుకున్నాడు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీ నరసింహారెడ్డి ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement

ఆ ఛార్జీలను తగ్గించిన టీఎస్ఆర్టీసీ

సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఆర్థిక భారం త‌గ్గించ‌డానికి ముందస్తు రిజర్వేషన్‌ చార్జీలను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) సవరించింది. ముందస్తు రిజర్వేషన్‌ సదుపాయం ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో చార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.ఎక్స్‌పెస్‌, డీలక్స్‌ సర్వీసుల్లో 350 కిలో మీటర్లలోపు రూ.20గా, 350 ఆపై కిలోమీటర్లకు రూ.30గా చార్జీని నిర్ణయించింది. సూపర్ లగ్జరీ ఏసీ సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ చేసుకుంటే రూ.30వసూలు చేయనుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!