Homeవార్తలుసివిల్స్ – 2021​ ఫలితాలు విడుదల

సివిల్స్ – 2021​ ఫలితాలు విడుదల

యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ -2021 తుది ఫలితాలు వెల్లడయ్యాయి. 685 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా, వీరిలో శృతి శర్మకు మొదటి ర్యాంకు, అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు, గామిని సింగ్లాకు మూడో ర్యాంకు వచ్చాయి. అఖిల భారత సర్వీసులకు మొత్తం 685 మంది ఎంపిక కాగా.. జనరల్‌ కోటాలో 244 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 73, ఓబీసీ 203, ఎస్సీ 105, ఎస్టీ విభాగం నుంచి 60 మంది ఉన్నారు. పోస్టుల వారీగా చూస్తే ఐఏఎస్‌కు 180, ఐపీఎస్‌కు 200, ఐఎఫ్‌ఎస్‌కు 37 మంది ఎంపికయ్యారు. ఇక సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఏ కేటగిరీకి 242 మంది ఎంపిక కాగా.. మరో 90 మంది గ్రూప్‌ బీ సర్వీసులకు ఎంపికైనట్లు యూపీఎస్‌సీ ప్రకటించింది.

Advertisement

తెలుగు విద్యార్థుల జోరు

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డికి 15వ ర్యాంకు రాగా.. పూసపాటి సాహిత్య (24), కొప్పిశెట్టి కిరణ్మయి (56), శ్రీపూజ (62), గడ్డం సుధీర్‌కుమార్‌రెడ్డి (69), ఆకునూరి నరేశ్‌ (117), అరుగుల స్నేహ (136), బి.చైతన్యరెడ్డి (161), ఎస్‌.కమలేశ్వరరావు (297), విద్యామరి శ్రీధర్‌ (336), దిబ్బడ ఎస్వీ అశోక్‌ (350), గుగులావత్‌ శరత్‌ నాయక్‌ (374), నల్లమోతు బాలకృష్ణ (420), ఉప్పులూరి చైతన్య (470), మన్యాల అనిరుధ్‌ (564), బిడ్డి అఖిల్‌ (566), రంజిత్‌కుమార్‌ (574), పాండు విల్సన్‌ (602), బాణావత్‌ అరవింద్‌ (623), బచ్చు స్మరణ్‌రాజ్‌ (676) ర్యాంకులు సాధించారు.

Advertisement

RECENT POSTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!