HomeLATESTప్రముఖ ఐటీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్.. రిక్రూట్‌మెంట్ వివరాలివే.. 

ప్రముఖ ఐటీ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోం జాబ్స్.. రిక్రూట్‌మెంట్ వివరాలివే.. 

ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగం ఆర్థిక మాంద్యం భయాలతో కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇతర నిర్ణయాలతో ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. దీంతో ఈ రంగంలో నియామక ప్రక్రియ ఆశించిన స్థాయిలో ఊపందుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగులకు ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఐటీ సర్వీసెస్ అండ్ కన్సల్టింగ్ సంస్థ క్యాప్‌జెమినీ (Capgemini) గూడ్‌న్యూస్ చెప్పింది. వివిధ విభాగాల్లో ఐటీ ఉద్యోగాల భర్తీకి రిక్రూట్‌మెంట్ చేపడుతున్నట్లు కంపెనీ ప్రకటించింది.

Advertisement

ఈ రిక్రూట్‌మెంట్‌లో భర్తీ చేయనున్న జాబ్ రోల్స్ వివరాలను కంపెనీ వెల్లడించింది. ప్రధానంగా ఇన్‌వాయిస్ ప్రాసెసింగ్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్, మాన్యువల్ టెస్టర్, ప్రాజెక్ట్ మేనేజర్, గ్రాడ్యుయేట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, జూనియర్ బిజినెస్ అనలిస్ట్, మెకానికల్ అండ్ ఫిజికల్ ఇంజనీర్, మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్ ఇంటర్న్, స్క్రమ్ మాస్టర్, క్లయింట్ పాట్‌నర్, ఫైనాన్సియల్ అనలిస్ట్ వంటి ఉద్యోగాల భర్తీ కోసం కంపెనీ హైరింగ్ చేపడుతోంది. జాబ్ రోల్ బట్టి అర్హతలు, ఎక్స్‌పీరియన్స్ వేర్వేరుగా ఉన్నాయి.

వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్: క్యాప్‌జెమిని వర్క్‌ ఫ్రమ్ హోమ్, వర్క్‌ ఫ్రమ్ ఎనీవేర్ జాబ్స్‌ కూడా భర్తీ చేయనుంది. సర్వీస్‌నౌ టెస్టర్, సేవియంట్ డెవలపర్, అజుర్ డేటా ఇంజనీర్, సోర్ ఆర్కిటెక్ (Soar architect), MySQL డేటా బేస్, సేల్స్‌ఫోర్స్ లైటనింగ్ డెవలపర్ వంటి రోల్స్‌ను వర్క్ ఫ్రం హోమ్ విధానంలో భర్తీ చేయనుంది. మరిన్ని వివరాల కోసం కంపెనీ లింక్డ్ ఇన్ పేజ్ లేదా అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయవచ్చు. 

క్యాప్‌జెమిని ప్రపంచవ్యాప్తంగా మొత్తం వర్క్‌ఫోర్స్ 3,60,000 కాగా, భారత్‌లో 1,85,000 మంది ఉద్యోగులతో కంపెనీ కార్యకలాపాలను కొనసాగిస్తోంది. రిక్రూట్‌మెంట్‌ గురించి వివరాలను కంపెనీ వెబ్‌పేజీ పేర్కొంది. మీరు సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే క్యాబ్ జెమినీలో చేరి మరింత స్థిరమైన, సమగ్రమైన భవిష్యత్తు కోసం కెరీర్‌ను బిల్ట్ చేసుకోండి. తద్వారా క్లయింట్స్ వృద్ధికి దోహదపడండి. క్యాప్‌జెమినీలో ఫ్రీ-థింకర్స్, ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇండస్ట్రీ ఎక్స్‌పర్ట్స్‌తో కూడిన విభిన్నమైన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌లో భాగం అవ్వండి.’ అని తెలిపింది. 

Advertisement

గ్లోబల్ కంటే భారత్‌లో జోరు: భారతదేశంలో తమ కంపెనీ ఎక్కువ వృద్ధిని నమోదు చేస్తోందని క్యాప్‌జెమిని ఇండియా బిజినెస్ యూనిట్ ఎండీ అనంత్ చంద్రమౌళి చెప్పారు. అందుకే ఇక్కడ టెక్నాలజీ అడాప్షన్ వేగవంతం చేస్తామన్నారు. దేశంలో రవాణా, తయారీ, టెలికాం, కన్సూమర్ ప్రొడక్ట్స్, రిటైల్ రంగాల్లో కంపెనీ భారీగా ప్రగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయని వివరించారు. ఆటోమోటివ్, రైల్‌రోడ్ సబ్‌సెక్టార్స్ రవాణా రంగంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 5G రోల్ అవుట్‌తో టెలికాం రంగంలో డిమాండ్‌ను ప్రేరేపిస్తోందని చంద్రమౌళి చెప్పుకొచ్చారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!