HomeLATESTగ్రూప్-2 సిలబస్ లో మార్పులు.. కొత్త సిలబస్ ఇదే!

గ్రూప్-2 సిలబస్ లో మార్పులు.. కొత్త సిలబస్ ఇదే!

ఏపీలో గ్రూప్-2 (Group-2) ఉద్యోగాల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల అవుతుందని ప్రచారం సాగుతున్న వేళ.. ఏపీపీఎస్సీ (APPSC) కీలక ప్రకటన చేసింది. గ్రూప్-2 కు సంబంధించి సిలబస్ లో పలు మార్పులు చేస్తున్నట్లు తెలిపింది. రెండు దశల రాత పరీక్షల ద్వారా గ్రూప్-2 నియామకాలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి మొదట స్క్రీనింగ్ ఎగ్జామ్ ను (ప్రిలిమ్స్) నిర్వహించనున్నారు. రెండో దశలో 300 మార్కులకు గాను మెయిన్స్ ఎగ్జామ్ ను నిర్వహించనున్నారు. ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని మెయిన్స్ కు ఎంపిక చేయనున్నారు. అయితే.. ఈ ప్రిలిమ్స్ కు సంబంధించి సిలబస్ లో భారతీయ సమాజం అనే కొత్త టాపిక్ ను చేర్చారు. మార్పులు చేసిన సిలబస్ ప్రకారం.. ప్రాథమిక పరీక్షలో భూగోళశాస్త్రం, భారతీయ సమాజం, మెంటల్ ఎబిలిటీ, కరెంట్ అఫైర్స్ తదితర టాపిట్ ల నుంచి ప్రశ్నలు అడగనున్నారు.

Advertisement

ఇంకా మెయిన్స్ విషయానికి వస్తే.. మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ కు 150 మార్కులు ఉంటాయి. మొత్తం రెండు పేపర్లకు కలిపి 300 మార్కులకు ఈ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్-1 కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ సామాజిక, సాంస్కృతిక చరిత్ర, భారత రాజ్యాంగం ఉంటాయి. పేపర్-2లో భారతదేశ, ఏపీ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర టాపిక్ ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!