ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన కెనరా బ్యాంక్ (Canara Bank) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 500 ప్రొబేషనరీ ఆఫీసర్/ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 21ను ఆఖరి తేదీగా నిర్ణయించింది కెనరా బ్యాంక్.
విద్యార్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డ్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 20-30 ఏళ్లు. వివిధ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు. ఆ వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
అప్లికేషన్ లింక్: https://ibpsonline.ibps.in/crppo13jun23/
దరఖాస్తు ఫీజు:
SC/ST/PwD అభ్యర్థులకు రూ.175, ఇతర అభ్యర్థులకు- రూ.850 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.
ఎంపిక ప్రక్రియ:
అభ్యర్థుల ఎంపిక:
అభ్యర్థులకు మొదట ప్రిలిమినరీ ఎగ్జామ్, అనంతరం మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.