HomeLATESTకేసీఆర్ కు ట్రైలర్​ చూపిస్తాం.. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: టుడే న్యూస్ ఏప్రిల్...

కేసీఆర్ కు ట్రైలర్​ చూపిస్తాం.. తెలంగాణలో వచ్చేది బీజేపీ సర్కారే: టుడే న్యూస్ ఏప్రిల్ 23

ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తాం

చేవేళ్ల బహిరంగ సభలో అమిత్ షా

Advertisement

టీఆర్​ఎస్​ బీఆర్​ఎస్​ అయ్యిందని, తెలంగాణలో కేసీఆర్​ పని అయిపోయిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. పీఎం కావాలని కేసీఆర్​ కలలు కంటున్నాడని.. దేశంలో కేసీఆర్​ ఏమీ కాలేడని ఎద్దేవా చేశారు. అక్కడ పీఎం కుర్చీ ఖాళీ లేదని, మళ్లీ నరేంద్ర మోడీ నే ప్రధాని అవుతాడని ధీమా వెలిబుచ్చారు. అంతకు ముందే తెలంగాణా లో బీజేపీ ట్రైలర్ చూపించబోతుందని అన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి రాకముందే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం ను పారద్రోలి తెలంగాణాకి స్వాతంత్య్రం తెచ్చారని.. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో తెలంగాణ స్వతంత్ర దినోత్సవం జరుపుతామని హామీ ఇస్తున్నామని అన్నారు. చేవెళ్లలో ఏర్పాటు చేసిన బీజేపీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అవినీతి పాలనపై అమిత్​షా నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుందని.. ఎంఐఎం కోసం కాదని అన్నారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి.. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. కార్ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉందని విమర్శించారు. కమలానికి ఓటు వేస్తే కమలం మీద కూర్చుని లక్ష్మీ దేవి తెలంగాణకు వస్తుందని అమిత్​షా అన్నారు. రోడ్లు వేయడానికి కేంద్రం నిధులు ఇస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను డబ్బులు ఇవ్వడం లేదన్నారు. తెలంగాణలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని అమిత్​షా ఆరోపించారు. కేసీఆర్​ యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడని.. టీఎస్​పీఎస్​సీ పేపర్​ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దోషులందరికీ శిక్ష తప్పదని హెచ్చరించారు. బీజేపీ కార్యకర్తలు జైల్లో పెట్టినా, కొట్టినా భయపడరని కేసీఆర్​కు సవాల్​ చేశారు.

పంట నష్టం అంచనా వేయాలని సీఎం ఆదేశాలు

అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటల నష్టాన్ని అంచనా వేసేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు.కరీంనగర్ జిల్లా చొప్పదండి, కరీం నగర్ రూరల్ మండలంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాలతో భారీ నష్టం వాటిల్లింది. అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో మాట్లాడి నష్టపోయిన పంటలకు సంబంధించిన వివరాలతో కూడిన నివేదికలు తెప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆదివారం కూడా సూర్యాపేట, ఖమ్మం, వరంగల్​, కరీంనగర్​ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వడగళ్ల వానలు కురవటంతో అపార నష్టం సంభవించింది.

తడిసిన ధాన్యం కొంటాం.. మంత్రి గంగుల

ఇటీవల కురుస్తున్న అకాల వర్షాలకు వరి రైతులు తీవ్ర నష్టపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ రైతులకు ఊరట కలిగించే వార్త చెప్పారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొంటామని హామీ ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఎకరాకు పది వేల నష్ట పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సకాలంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం ద్వారా పంట నష్టం తగ్గిందన్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని చొప్పదండి, గంగాదర, హుజురాబాద్ మండలాలతో పాటు, కరీంనగర్ గ్రామీణంలోని చమాన్ పల్లి, తాహెర్ కొండాపూర్, ఫకీర్ పేట్, జూబ్లీ నగర్, చెర్లబూత్కూరు, ముగ్దుంపూర్ తదితర ప్రాంతాల్లో 5వేల ఎకరాల్లో పూర్తి స్థాయిలో పంట నష్టం జరిగిందని మంత్రి ప్రకటించారు. మొదటి విడత పంటనష్టంగా జిల్లాలోని ఆయా ప్రాంతాలకు సంబంధించిన రైతులకు ఎనిమిదన్నర కోట్లు పరిహారం విడుదలైందన్నారు. త్వరలోనే వాటిని రైతులకు అందిస్తామన్నారు. ప్రస్తుతం జరిగిన పంట నష్టాన్ని రెండు మూడురోజుల్లో పూర్తి స్థాయిలో అంచనా వేసి ఆదుకుంటామని భరోసానిచ్చారు

Advertisement

నిరంజన్​రెడ్డి వర్సెస్​ రఘునందన్​రావు

ఎమ్మెల్యే రఘునందన్ రావు కు చేసిన ఆరోపణల్లో ఒక్కటి నిరూపించినా రాజీనామా చేస్తానని మంత్రి నిరంజన్​రెడ్డి మరోసారి సవాల్ చేశారు. ఆరోపణలు నిరూపించకపోతే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్​ చేశారు. నిరంజన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానని రఘునందన్​రావు కామెంట్​ చేశారు. ఆరోపణలకు స్పందించి తనను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఎప్పుడు పిలిచినా వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానని..ఆయన కేవలం వనపర్తి మంత్రిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

బీఆర్​ఎస్​ కాంగ్రెస్ కలిసే పోటీ చేస్తాయి: బండి సంజయ్​

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. ఎఐసిసి అధ్యక్షులు ఖర్గే, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కూడా ఇదే మాటలు అంటున్నారని గుర్తు చేశారు. కర్ణాటక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్​కు ఆర్థిక సహాయం చేస్తుందని అన్నారు. మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకల సందర్భంగా ట్యాంక్ బండ్ పై బసవేశ్వర విగ్రహానికి బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ వద్ద కాంగ్రెస్ డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని మునుగోడు ఓటర్లు మాట్లాడుకుంటున్నారని అన్నారు. కేవలం తన పదవి పోతుందన్న భయంతోనే రేవంత్ రెడ్డి కన్నీళ్లు పెట్టుకున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ అన్నారు. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో రేవంత్​ సతమతమవుతున్నాడని విమర్శించారు. 25 కోట్లు రేవంత్ రెడ్డికి ఇచ్చారని ఈటల అనలేదని, కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారని మాత్రమే అన్నారంటూ ఈటల ఇటీవల చేసిన కామెంట్లను సపోర్టు చేశారు.

రేవంత్ పై మళ్లీ మండిపడ్డ ఈటల

తనను అడ్డుకున్నే దమ్ము రేవంత్ కు లేదంటూ ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ మండిపడ్డారు. సైకో ఫ్యాన్స్ తో రాత్రి పూట ఫోన్ లు చేయించే చిల్లర పనులు మానుకోవాలని హెచ్చరించారు. భాగ్యలక్ష్మీ దేవాలయానికి పోలీసుల రేవంత్ ను ర్యాలీతో తీసుకెళ్ళటం వెనుక మతలబు ఏంటో చెప్పాలని అన్నారు. పైసలిచ్చి పీసీసీ పదవి తెచ్చుకున్నారని కాంగ్రెస్​ నేతలే అంటున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ దోస్తీని సహించలేకనే.. మర్రి, మహేశ్వరరెడ్డి లాంటి నేతలు బీజేపీలో చేరినట్లు చెప్పారు. కాంగ్రెస్ లో బీఆర్ఎస్ కోవర్టులున్నారని రేవంత్ రెడ్డి మాట్లాడిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. 2018 ఎన్నికల్లో తనతో పాటు రామగుండం, ఎల్లారెడ్డి, పెద్దపల్లిలో 12 చోట్ల సొంత అభ్యర్థులను ఓడించటానికి కేసీఆర్ డబ్బులు పంపాడని ఆరోపించారు. హుజూరాబాద్ లో అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి కౌషిక్ రెడ్డికి కేసీఆర్ డబ్బులు పంపాడని అన్నారు. మరోవైపు రేవంత్​పై చేసిన కామెంట్లపై కాంగ్రెస్​ నేతలు ఈటలపై మండిపడ్డారు.

Advertisement

ఈటలపై మండిపడ్డ కౌశిక్​రెడ్డి

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌పై బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి, ఈటల రాజేందర్ ఇద్దరూ ఒక్కటేనని ఆరోపించారు. రేవంత్ రెడ్డికి ఈటల డబ్బులిచ్చాడని ఆరోపించారు. వేం నరేందర్ కొడుకు పెళ్లిలో వీరిద్దరి మధ్య హుజురాబాద్ ఉప ఎన్నిక డీల్ కుదిరిందని ఆరోపించారు. దీనిపై ఇల్లంతకుంట రాముడి సాక్షిగా ప్రమాణం చేద్దాం అని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి, ఈటల మధ్య తేడా రావడంతో ఈ విషయం బయటపడిందన్నారు.

ధర్మపురి స్ట్రాంగ్ రూం పగులగొట్టిన ఆఫీసర్లు

ధర్మపురి ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ తాళాలను అధికారులు పగులగొట్టారు. ధర్మపురి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్​కుమార్​ వేసిన కేసులో హైకోర్టు ఆదేశాలతో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్​ను అదికారులు తెరిచారు. జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష,ఎన్నికల అబ్జర్వర్ అవినాష్ కుమార్ అధ్వర్యంలో అందులో ఉన్న ఓట్ల ఫలితాలపై రీకౌంటింగ్ విచారణ కొనసాగుతోంది. 17సీ ఫామ్ లో నమోదు చేసి ఓట్ల సంఖ్య ఈవీఎంలో నమోదైన ఓట్లతో ట్యాలీ కావాల్సి ఉంది. టోటల్ ఓట్లతో పాటుగా పోలైన ఓట్లు, అభ్యర్థులకు వచ్చిన వివరాలన్నీ 17సి డాక్యుమెంట్లో ఉంటాయి. వీటి ఆదారంగా ఈనెల 26న అధికారులు హైకోర్టుకు నివేదిక అందించనున్నారు.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!