Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSటెన్త్ పాసైతే చాలు​ BEL జాబ్ ..ఈ లింక్ తో దరఖాస్తు చేయండి!

టెన్త్ పాసైతే చాలు​ BEL జాబ్ ..ఈ లింక్ తో దరఖాస్తు చేయండి!

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)లో 12 హవల్దార్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లోని పోస్టులకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ bel-india.in ద్వారా జూన్ 6, 2023లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Advertisement

ఖాళీల వివరాలు:

హవల్దార్ (సెక్యూరిటీ) -12 పోస్టులు. జనరల్ కేటగిరీలో 06, ఈడబ్ల్యూఎస్ 01, ఓబీసీ 03, ఎస్సీ 02 పోస్టులను కేటాయించారు.

అర్హతలు:

Advertisement

అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అధికారిక నోటిఫికేషన్‌లో ఇచ్చిన అనుభవం ఉండాలి.

వయో పరిమితి:

అభ్యర్థుల గరిష్ట వయస్సు 43 సంవత్సరాలు. వయస్సు 1 మే 2023 ఆధారంగా లెక్కించబడుతుంది. ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

Advertisement

జీతభత్యాలు:

నెలకు రూ. 20,500-79,000 ఇవ్వబడుతుంది . అలాగే CTC: రూ. 5.11 లక్షలుగా ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

Advertisement

ఈ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్‌లో ఉత్తీర్ణులు కావాలి. శారీరక దారుఢ్య పరీక్షలో అర్హత సాధించిన వారు రాత పరీక్షకు షార్ట్‌లిస్ట్ చేయబడతారు. ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ అండ్ రాత పరీక్ష బెంగళూరులో నిర్వహించబడుతుందని అభ్యర్థులు గమనించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!