ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. గ్రూపు-2లో అదనంగా 212 పోస్టులను పెంచుతూ ప్రభుత్వం జీవోను రిలీజ్ చేసింది. కాగా గతంలోనే గ్రూప్-2లో 508పోస్టుల భర్తీకి సర్కార్ జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఖ్యను పెంచాలని నిరుద్యోగుల అభ్యర్థనకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల నుంచి మరోసారి ఖాళీల వివరాలను తెచ్చుకుంది జీఎడీ. వాటిని పరిశీలించిన అనంతరం 212 పోస్టులను పెంచుతూ ఉత్త్వరులు జారీ చేసింది. దీంతో త్వరలోనే మొత్తం 720 పోస్టుల భర్తీకి ఎపీపీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది.
Advertisement
