హైదరాబాద్ లోని సీ డాక్ ( సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్) సెప్టెంబర్ బ్యాచ్ డిప్లొమా కోర్సులకు నోటిఫికేన్ జారీ చేసింది. ఇంజనీరింగ్ స్డూడెంట్లకు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డిప్లొమా ఆన్ లైన్ కోర్సును ఆఫర్ చేసింది. ప్లేస్‌మెంట్స్, మంచి జాబ్ కోసం ఎదురుచూస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇది సరైన అవకాశం. ఈ కోర్సు పూర్తయిన వెంటనే మంచి కంపెనీలో జాబ్ అందుకునే ఛాన్స్ ఉంటుంది. సీడాక్ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ పరిధిలో పనిచేస్తున్న సైంటిఫిక్ సొసైటీ. ఐటీ, ఎలక్ట్రానిక్స్, అండ్ అసోసియేట్ వింగ్స్‌లో రీసెర్చ్, డెవలప్ మెంట్ కోసం కృషి చేస్తున్న సంస్థ, ఇది. ఈ కోర్సు చేసిన అభ్యర్థులకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కు ఈ సంస్థ సహకరిస్తుంది. ప్రతి ఏడాది దాదాపు 300 కంపెనీలు ప్లేస్‌మెంట్స్ కు సీడాక్ ను ఆశ్రయిస్తాయి.
కోర్సు; అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ డిప్లొమా
కాల వ్యవధి; ఆరు నెలలు. ఆరువందల గంటల సేపు థియరీకి తోడు ల్యాబ్, ప్రాజెక్టు ఇందులో భాగం.
నిరంతర ల్యాబ్, అసెస్మెంట్స్ ఉంటాయి. ఇండస్ట్రీతో అనుసంధానమైన ఈ కోర్సులో ట్యుటోరియల్, ఆన్ లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి.
కోర్సు మాడ్యూల్స్; ఫండమెంటల్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ కాన్సెప్ట్, ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ విత్ జావా, అల్గరిథమ్స్ అండ్ డేటా స్టక్చర్స్, డేటాబేస్ టెక్నాలజీస్, వెబ్ ప్రోగ్రామింగ్ టెక్నాలజీస్, వెబ్ బేస్డ్ జావా ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆటిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్, సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ అండ్ ప్రాజెక్ట్.
అర్హత; కనీసం 50 శాతం మార్కులతో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా కంప్యూటర్ సైన్స్/ ఐటి/ ఎలక్ట్రానిక్స్/ ఫిజిక్స్/ మేథ్స్/ స్టాటిస్టిక్స్ పీజీ లేదా మేనేజ్ మెంట్ పీజీ డిగ్రీకి తోడు ఐటి/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ అప్లికేష న్స్ లేదా ఎంసిఎ/ఎంసిఎం ఉత్తీర్ణులై ఉండాలి
సెలెక్షన్స్; జాతీయ స్థాయిలో జరిగే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ లో సాధించిన మెరిట్ ఆధారంగా ఈ డిప్లొమా కోర్సులోకి అభ్యర్థులను తీసుకుంటారు. ఈ కోర్సులో చేరే అభ్యర్థికి లాప్ టాప్ లేదా పీసీ తప్పనిసరిగా ఉండాలి.
కోర్సు ఫీజు; రూ.50 వేలు.. జీఎస్టీ అదనం.
రిజి స్ట్రేషన్ కు ఆఖరు తేదీ; ఆగస్టు 20
పూర్తి వివరాలకు https://www.cdac.in