నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది ఆరోగ్య శాఖ. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ పలు నగరాల్లో వైద్య సంస్థల్లో ఖాళీగా ఉన్న 487 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. న్యూఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నైలలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించింది. ఆరోగ్య శాఖ ప్రకటించిన పోస్టులకు అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా సెలక్ట్ చేస్తారు.
రీసెర్చ్ అసిస్టెంట్, టెక్నిషియన్, ల్యాబొరేటరీ అటెండెంట్, ల్యాబొరేటరీ టక్నీషియన్, హెల్త్ ఇన్ స్పెక్టర్ ఫీల్డ్ వర్కర్, లైబర్రీ అండర్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, లైబ్రరీ క్లర్క్, ఫిజియోథెరిపిస్ట్, మెడికల్ సోషల్ వెల్ఫెర్, మెడికల్ ల్యాబొరేటరీ, యానిమల్ అంటెండెంట్, లైబ్రరీ క్లర్క్, పారామెడికల్ వర్కర్, వర్క్ షాప్ అటెండెంట్ వంటి 487 పోస్టులు ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాయి.
దరఖాస్తు ఫీజు రూ. 600. మహిళలకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి మారుతుంది. కొన్ని పోస్టులకు 25ఏళ్లు ఉండగా మరికొన్ని పోస్టులకు 27 సంవత్సరాలు ఉంది. ఓబీసీలు, ఎక్స్ సర్వీస్ మెన్ కు 3ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలు ప్రభుత్వ ఉద్యోగులకు 5ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 నుంచి 15ఏళ్ల మినహాయింపు ఇచ్చారు.