తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) తాజాగా కీలక ప్రకటన చేసింది. వివిధ ఇంజనీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్ & జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు (Notification No.16/2022) సంబంధించిన పరీక్ష హాల్ టికెట్లను విడుదల చేస్తున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఈ రోజు అంటే ఫిబ్రవరి 27 నుంచి తమ హాల్ టికెట్లను కమిషన్ వెబ్ సైట్ https://www.tspsc.gov.in/ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
ఈ పరీక్షను మార్చి 5వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. అనంతరం మధ్యాహ్నం 02:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు ఆగకుండా ముందుగానే హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాలని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.