HomeLATESTహార్టికల్చర్​ పరీక్ష 17న.. ఈ రోజు నుంచే హాల్ టికెట్లు.. పూర్తి వివరాలు

హార్టికల్చర్​ పరీక్ష 17న.. ఈ రోజు నుంచే హాల్ టికెట్లు.. పూర్తి వివరాలు

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ కు సంబంధించి ఈ నెల 17న పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఆ రోజు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుందని వెల్లడించింది. అభ్యర్థులు టీఎస్పీఎస్సీ అధికారిక వెబ్ సెట్ (https://www.tspsc.gov.in/) ద్వారా ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.

Advertisement

పరీక్షకు 45 నిమిషాల ముందు వరకూ హాల్ టికెట్లను వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని తెలిపింది. పరీక్ష కంటే ముందు అభ్యర్థులు ప్రాక్టీసు కోసం వెబ్ సైట్ ద్వారా మాక్ టెస్ట్ రాసే అవకాశం కల్పించినట్లు కమిషన్ తెలిపింది. అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలని సూచించింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!