Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSతెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే ఆ హాల్ టికెట్లు.. వివరాలివే

తెలంగాణ పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. ఎల్లుండి నుంచే ఆ హాల్ టికెట్లు.. వివరాలివే

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (TSLPRB) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఈ నెల 11న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు SCT SI (IT & CO) పోస్టులకు, SCT ASI (FPB) పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష (టెక్నికల్ పేపర్స్) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను ఎల్లుండి అంటే.. మార్చి 6వ తేదీ ఉదయం 8 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలిపింది. అభ్యర్థులు 9వ తేదీ అర్థరాత్రి వరకు తమ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.

Advertisement

అబ్యర్థులు ఎవరికైనా హాల్ టికెట్ల డౌన్ లోడ్ లో ఇబ్బందులు ఎదురైతే 93937 11110, 93910 05006 నంబర్లను సంప్రదించాలని సూచించింది. లేదా support@tslprb.in మెయిల్ ద్వారా అయినా సంప్రదించాలని తెలిపింది. హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత దానిపై పాస్ పోర్ట్ సైజ్ ఫొటోను అంటించాలని బోర్డు సూచించింది. పాస్ పోర్ట్ సైజ్ ఫొటో అంటించని హాల్ టికెట్లను కలిగి ఉన్న వారిని పరీక్షకు అనుమతించేది లేదని బోర్డు స్పష్టం చేసింది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!