నిరుద్యోగులకు శుభవార్త. ఎయిర్ పోర్టు ఆథారిటీ ఆఫ్ ఇండియాలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 496 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. సైన్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఈ పోస్టులకు అర్హులు. ఆన్ లైన్ విధానంలో పరీక్షను నిర్వహించనున్నారు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ. 13లక్షల వేతనంతోపాటు ప్రమోషన్స్ కూడా ఉండనున్నాయి. నెలకు వీరికి రూ. 40వేల వేతనం అందిస్తారు. జీతంలోపాటు డీఎ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సహకాలు అదనంగా ఉంటాయి.
ఎంపిక విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ఆన్ లైన్ పరీక్ష ద్వారా సెలక్ట్ చేస్తారు. పరీక్షల్లో ప్రతిభ చూపిన అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం ధ్రువపత్రాల పరిశీలనతోపాటు వాయిస్ టెస్టు కూడా ఉంటుంది. అనంతరం సైకోయాక్టివ్, సబ్ స్టాన్సెస్ టెస్టు, సైకలాజికల్ అసెస్ మెంట్ టెస్టు, మెడికల్ టెస్టు, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ నిర్వహిస్తారని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే వీటిలో అర్హత సాధించడం తప్పనిసరి. రాతపరీక్షతోపాటు సంబంధిత విభాగాల్లో చూసి ఫైనల్ లిస్ట్ చేస్తారు. సెలక్ట్ అయిన అభ్యర్థులు దేశంలో ఎక్కడైనా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలి.
పరీక్ష విధానం:
120 మార్కుల ప్రశ్నాపత్రం…ఇంగ్లీష్, హిందీలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కుఉంటుంది. మొత్తం 120 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు ఉంటుంది. పార్ట్ ఏ, బీల నుంచి మొత్తం 60 చొప్పున ప్రశ్నలు అడుగుతారు.
ఇంగ్లీష్ లాంగ్వేజ్ 20,
జనరల్ ఇంటెలిజెన్స్ , రీజనింగ్ 15,
జనరల్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ 15,
జనరల్ నాలెడ్జ్ అవేర్ నెల్ 10
ఫిజిక్స్, మ్యాథ్స్ కాన్సెప్ట్ అప్లికేషన్స్ లో 60ప్రశ్నలు ఉంటాయి.
అర్హత:
మ్యాథ్స్, ఫిజిక్స్ బీఎస్సీ లేదా బీఈ లేదా బీటెక్ లో 60శాతం మార్కులతో ఉత్తీర్ణత ఉండాలి. ఇంగ్లీష్ భాషలో స్కిల్స్ అవసరం.
వయస్సు :
నవంబర్ 30, 2023 నాటికి 27ఏళ్లు మించి ఉండకూడదు.
దివ్యాంగులకు పదేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు,
దరఖాస్తుకు చివరి తేదీ:
నవంబర్ 30
దరఖాస్తు ఫీజు:
రూ. వెయ్యి, మహిళలు, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు మినహాయింపు ఇచ్చారు.