Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జులై 2020

కరెంట్​ అఫైర్స్​: జులై 2020

ఇంటర్నేషనల్

నిఘా నగరాల జాబితాలో హైదరాబాద్‌

ఇంగ్లాండ్ లోని  కంపారిటెక్ సంస్థ  ప్రపంచంలోని 150 నగరాలను ఎంపిక చేసి  అత్యున్నత నిఘా నగరాల జాబితాను రూపొందించింది. ఇందులో ప్రతి వెయ్యి మందికి  119.7 కెమెరాలతో తైయువన్(చైనా) తొలిస్థానంలో నిలవగా 92.14 కెమెరాలతో వూక్స్‌(చైనా), 67.47 కెమెరాలతో లండన్‌(ఇంగ్లాండ్‌), వరస స్థానాల్లో నిలిచాయి. 29.99 కెమెరాలతో హైదరాబాద్​(భారత్) 16 స్థానంలో నిలిచింది.చెన్నై 21వ స్థానం, ఢిల్లీ 33వ స్థానంలో నిలిచాయి. అత్యధిక జనాభాగల నగరాలను పరిశీస్తే టోక్యో, ఢిల్లీ, షాంగై నగరాలు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

నిషాన్‌–ఏ–పాకిస్తాన్

1959 నుంచి పాకిస్తాన్ అందిస్తున్న అత్యున్నత పౌరపురస్కారం–2020 ఏడాదికి కశ్మీర్ వేర్పాటు వాది హరితయ్ కాన్ఫరెనస్ నాయకుడు సయ్యద్ అలిఫా గిలినా ఎంపికయ్యాడు. ఈయన పేరుమీదుగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌‌లో ఇంజినీరింగ్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నట్టు పాక్ ప్రభుత్వం ప్రకటించింది. 1990 నుంచి కశ్మీర్‌‌లో ఉగ్రవాదం పెరిగేందుకు ఇతని పరోక్ష విధానాలే కారణం.

చైనా అంగారక యాత్ర

అంగారకగ్రహంపై పరిశోధనలు జరిపేందుకు చైనా  చేపట్టిన ‘తియాన్‌విన్‌–1’ ప్రయోగం విజయవంతమైంది. 200కేజీల బరువుగల ఈ వ్యోమనౌకతో పాటు ల్యాండర్, రోవర్‌‌ను హైనాన్ ద్వీపంలోని వెంచాంగ్ అంతరిక్ష కేంద్రం నుంచి  ప్రయోగించింది. , ఏడు నెలల సుదీర్ఘ ప్రయాణం తరువాత  2021 ఫిబ్రవరిలో అంగారక గ్రహాన్ని చేరుకుంటుందని సైంటిస్టులు  తెలిపారు.

ఐఆర్‌‌సీటీసీ క్రెడిట్‌ కార్డు

ఐఆర్‌సీటీసీ, ఎస్‌బీఐ కార్డు సంయుక్తంగా కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును జులై 28న విడుదల చేశాయి. దీని ద్వారా  రైల్వే, వాణిజ్య, రైల్ టికెట్ బుకింగ్, ఇతర లావాదేవీల విషయంలో సెక్యూరిటీ కోసం ఈ క్రెడిట్‌ కార్డును రూపొందించారు. దీనిలో  నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్‌ఎఫ్‌సి) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు.

కోవిడ్‌–19పై స్వతంత్ర కమిటి

కోవిడ్‌–19పై ఆయా దేశాలు ఎదుర్కొంటున్న తీరు,  నివారణ చర్యలు పరిశీలించడానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్వతంత్ర్య కమిటీని ఏర్పాటు చేసింది.  ఇందులో ఎరిన్ జాన్సన్, హెలెన్ క్లార్క్‌, సభ్యులుగా ఉన్నారు. ఎలెన్ జాన్సన్ 2006–18 వరకు లైబిరియా అధ్యక్షుడిగా ఉన్నారు. ఈయన 2011లో నోబెల్ ప్రైజ్ అందుకున్నారు. హెలెన్ క్లార్క్ 1999–2008 వరకు న్యూజిలాండ్ ప్రధానిగా పనిచేశారు.

యూఎన్‌వో  ఫుడ్ సెక్యూరిటీ నివేదిక

కోవిడ్–19 కారణంగా ప్రపంచంలో ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య  పెరిగిందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.  ఆహారం, పౌష్టికాహార లోపం అనే అంశాలపై ‘ఫుడ్ సెక్యూరిటీ, న్యూట్రిషన్ ఇన్ ద వరల్డ్-2020’ నివేదికను జూలై 13న యూఎన్‌వో  విడదల చేసింది.దీని ప్రకారం  2020 చివరి నాటికి  ప్రపంచవ్యాప్తంగా పౌష్టికాహార లోపంతో బాధపడేవారి సంఖ్య  13.2 కోట్ల మందికి చేరనుందని హెచ్చరించింది.

చైనా యాప్‌లపై నిషేధం

చైనాకు చెందిన 59 యాప్‌లపై నిషేధం విధిస్తూ జూన్ 29న కేంద్ర ఐటీ,  ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్ ప్రకటన చేసింది.  ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 69ఏ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నిబంధనలు-2009ని అనుసరించి యాప్‌లపై నిషేధం విధించినట్లు తెలిపింది. ఈ యాప్‌లు దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశరక్షణ, ప్రజా భద్రతకు హాని కలిగించేందుకు దోహదపడుతున్నాయి. అభిప్రాయపడింది. భారత్‌లో బాగా పాపులర్ అయిన టిక్‌టాక్, హెలో, యూసీ బ్రౌజర్, న్యూస్ డాగ్ వంటి యాప్‌లు సహా మొత్తం 59 యాప్‌లు ఈ జాబితాలో ఉన్నాయి

పీఎం ఎఫ్‌ఎంఈ పథకం

ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్‌లో భాగంగా మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఆర్థికంగా, సాంకేతికంగా అప్‌గ్రేడ్ అయ్యేందుకు తోడ్పాటు అందించేందుకు  కేంద్ర  ’పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రెజైస్’ (పీఎం ఎఫ్‌ఎంఈ) పథకాన్ని  జూన్ 29న ప్రవేశపెట్టింది. రుణాలు, టెక్నాలజీ, రిటైల్ మార్కెట్ లభ్యత తదితర అంశాలపరంగా దేశీ సంస్థలు ఎదుర్కొనే  ఇబ్బందుల పరిష్కారానికి  ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర సర్కార్ అభిప్రాయపడింది. ఇందుకోసం 2020-21 నుంచి 2024-25 వరకు రూ. 10,000 కోట్లను కేటాయించారు. gudn

వార్తల్లో వ్యక్తులు

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో  భారత అంపైర్ నితిన్ నరేంద్ర మేనన్‌కు అరుదైన అవకాశం లభించింది.  ఇంగ్లండ్‌కు చెందిన నైజేల్ లాంజ్ స్థానంలో 36 ఏళ్ల నితిన్ ప్యానెల్‌లోకి వచ్చారు.12 మంది సభ్యులు ఉండే  ఎలైట్ ప్యానెల్ అంపైర్ల జాబితాలో అత్యంత  పిన్న వయస్కుడిగా  నితిన్ నిలిచాడు. గతంలో భారత్ నుంచి శ్రీనివాస వెంకట రాఘవన్, సుందరం రవి ఎంపికయ్యారు.  

గుడ్ని జోహన్‌సన్‌

ఐస్‌లాండ్ నూతన అధ్యక్షుడిగా 91శాతం ఓట్లతో గుడ్ని జోహన్‌సన్ రెండో సారి ఎన్నికయ్యారు. 2016–20 వరకు అధ్యకుడిగా కొనసాగిన ఈయన ఆ దేశ చరిత్రలో అతి చిన్న అధ్యక్షుడిగా ప్రఖ్యాతి పొందారు.

ఆనందిబెన్ పటేల్

ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌‌గా కొనసాగుతున్న ఆనందిబెన్ పటేల్‌ జులై 01న  మధ్యప్రదేశ్  కేర్‌‌టేకర్‌‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత  మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్ అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరడంతో  కేంద్రం  నిర్ణయం తీసుకుంది.

సి.రంగరాజన్‌

భారత  ఆర్థికవేత్త పీ.సీ మహలనోబిస్ పేరుతో అందించే అవార్డును 2020 ఏడాదికి గాను  సీ రంగరాజన్‌కు లభించింది.  రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్‌‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌‌గా, 12వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా రంగరాజన్‌ సేవలందించారు.

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!