నివేదికలు
స్విస్‌బ్యాంక్ నివేదిక
స్విస్ అంతర్జాతీయ బ్యాంకు 2019 గణంకాల ఆధారంగా తాజాగా విడుదల చేసిన నివేధిక ప్రకారం అత్యధికంగా డబ్బు డిపాజిట్ చేసిన దేశంగా యునైటెడ్ కింగ్డమ్ (27శాతం) నిలిచింది. యూఎస్, వెస్టిండిస్, ఫ్రాన్స్, హాంకాంగ్‌లు తరువాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ 0.06శాతం డిపాజిట్లతో 77వ స్థానం పొందింది.
గ్లోబల్ స్టార్టప్ ఎకోసిస్టం ర్యాంకింగ్
స్టార్టప్ కంపెనీల ఏర్పాటుకు అనుకూల వాతరవరణం గల నగరాల జాబితాను స్టార్టప్ జీనోమ్ అనే సంస్థ ప్రకటించింది. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ తొలిస్థానంలో నిలవగా లండన్, న్యూయార్క్ సంయుక్తంగా ద్వితీయ స్థానంలో నిలిచాయి. భారత్ నుంచి బెంగళూర్ టాప్30లో నిలిచింది.
ది యంగ్ యూనివర్సిటీ ర్యాంకింగ్
టైమ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (టీహెచ్ఈ) 50 ఏళ్ల లోపు స్థాపించబడిన విద్యాసంస్థలకు బోధన, పరిశోధన, విద్యార్థుల నిష్పత్తి అంతర్జాతీయ సహకారం అధారంగా ది యంగ్ యూనివర్సిటీ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తొలిస్థానంలో నిలవగా ఐఐటీ భోపాల్(62), ఐఐటీ ఇండోర్ (64) వ ర్యాంక్ సాధించాయి.