Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జులై 2020

కరెంట్​ అఫైర్స్​: జులై 2020

స్పోర్ట్స్‌

బీసీసీఐ సీఈవోగా హేమంగ్ అమీన్‌

Advertisement

బోర్డ్‌ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) తాత్కాలిక సీఈవోగా హేమంగ్ అమీన్ జులై 14న నియమితులయ్యారు.జులై 9న రాజీనామా చేసిన రాహుల్ బోహ్రీ స్థానంలో ఈ నియామకం జరిగింది.  అమీన్ గతంలో  ఐపీఎల్‌కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా పని చేశారు.   ఫుల్వామా దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల సంక్షేమం కోసం 2019 ఐపీఎల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రద్దు చేసి డొనేషన్ అందించారు.

మోహన్ బగాన్‌ పురస్కారం

1975  లో నిర్వహించిన హాకీ ప్రపంచ కప్‌లో భారత జట్టు విజయానికి కృషి చేసిన హాకీ ప్లేయర్ అశోక్‌కుమార్‌‌కు మోహన్‌ బగాన్ అథ్లెటిక్ క్లబ్  జీవితసాఫల్య పురస్కారం అందించాలని నిర్ణయించింది. 1911 లో  జరిగిన ఫుట్‌బాల్ పోటీల్లో బ్రిటీష్ జట్టుపై  మోహన్‌బగాన్ జట్టు విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా జులై 29న జరిగే ఉత్సవాల్లో మోహన్‌బగాన్ పురస్కారం అందజేయనున్నారు.

Advertisement

చికాగో మారథాన్ రద్దు

అమెరికాలో కోవిడ్–19 కేసులు పెరుగుతుండడంతో   అక్టోబర్ 11న జరగాల్సిన చికాగో మారథాన్ రేసును రద్దు చేశారు. ఈ మారథాన్‌లో ప్రపంచంలోని అనేక దేశాల నుంచి  45 వేలకు పైగా రన్నర్‌లు, వీల్‌చైర్ అథ్లెట్లు పాల్గొంటారు. ఈ రేసును చూడటానికి సుమారు 10 లక్షల మంది హాజరవుతారు. ఇప్పటికే 2020, నవంబర్ 1న జరగాల్సిన న్యూయార్క్ మారథాన్, 2020, సెప్టెంబర్ 14న జరగాల్సిన బోస్టన్ మారథాన్ కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.

డెక్కన్ చార్జర్స్‌కు రూ.4800 కోట్లు

Advertisement

ఐపీఎల్‌‌ నుంచి టర్మినేట్‌‌ చేసిన డెక్కన్‌‌ చార్జర్స్‌‌ (డీసీ) ఫ్రాంచైజీకి రూ. 4800 కోట్లు పరిహారంగా చెల్లించాలని బాంబే హైకోర్టు నియమించిన ఆర్బిట్రేటర్‌‌  జూలై 17న బీసీసీఐని ఆదేశించారు. ఎనిమిదేళ్ల పాటు సాగిన విచారణలో రిటైర్డ్‌‌ జస్టిస్‌‌ సీకే టక్కర్‌‌, లీగ్‌‌ నుంచి ఫ్రాంచైజీని తొలగించడం చట్ట వ్యతిరేకమని స్పష్టం చేశారు. 2012 సెప్టెంబర్‌‌లో ఆర్బిట్రేటర్‌‌ను ఏర్పాటు చేయగా 10 రోజుల్లో రూ. 100 కోట్ల బ్యాంక్‌‌ గ్యారంటీ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

హరికృష్ణకు టైటిల్‌

స్విట్జర్లాండ్‌లోని బీల్‌ నగరంలో జరిగిన చెస్‌ 960 టోర్నీలోఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ పెంటేల హరికృష్ణ టైటిల్‌ను గెలుచుకున్నాడు. లాక్‌డౌన్ తర్వాత నిర్వహించిన తొలి చెస్ టోర్నీలో  హరికృష్ణ మొత్తం 5.5 పాయింట్లు స్కోరు చేశాడు. జర్మనీకి చెందిన 15 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్‌ విన్సెంట్‌ కీమెర్‌ ఐదు పాయింట్లతో రన్నరప్‌గా నిలువగా… 4.5 పాయింట్లతో వొజ్తాసెక్‌(పోలాండ్‌) మూడో స్థానాన్ని పొందాడు.

Advertisement

టి20  ప్రపంచకప్‌ వాయిదా

కోవిడ్–19 విజృంభణ కారణంగా టి20 ప్రపంచకప్‌ వాయిదా వేస్తున్నట్టు  అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)  జులై 20న ప్రకటించింది.  2021లో ఇదే తేదీల్లో పొట్టి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తామని స్పష్టం చేసింది. నవంబర్‌ 14న ఫైనల్‌ జరుగుతుంది. షెడ్యూల్‌ ప్రకారం 2021లోనే మరో టి20 ప్రపంచకప్‌ కూడా జరగాల్సి ఉంది. దానిని ఇప్పుడు 2022కు వాయిదా వేశారు. 2023లో భారత్‌లో జరగాల్సిన వన్డే వరల్డ్‌కప్‌ మాత్రం అదే ఏడాది కొత్త తేదీల్లో నిర్వహిస్తారు.

యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు

Advertisement

కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 సీజన్ ను యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దుబాయ్, అబుదాబి, షార్జా  స్టేడియంలలో  టోర్నీ నిర్వహించనున్నట్టు లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ చైర్మన్  బ్రిజేశ్‌ పటేల్‌ జులై 21న ప్రకటించారు. గతంలో 2014 ఐపీఎల్ తొలి మ్యాచ్‌లు ఎన్నికల కారణంగా యూఏఈలో నిర్వహించారు.

ప్రపంచ లీగ్స్ ఫోరంలో ఐఎస్‌ఎల్‌

2014లో భారత్ వేదికగా ప్రారంభమైన ఇండియన్ లీగ్‌ ఫ్రొఫెషనల్ ఫుట్‌బాల్ లీగ్ కూటమి, ప్రపంచ లీగ్స్ ఫోరంలో చేరింది. దీంతో వరల్డ్‌ లీగ్స్ ఫోరంలో చేరిన మొదటి దక్షిణాసియా లీగ్‌గా ఆసియాలోని 7వ లీగ్‌గా గుర్తింపు పొందింది. 2014లో ఇండియన్ సూపర్‌‌లీగ్‌ తొలి విజేతగా అథ్లెటిక్ కోల్‌కతా, 2018–19సీజన్‌లో బెంగళూర్‌‌ ఎఫ్‌.సీ, 2019–20 సీజన్‌లో అథ్లెటిక్‌ డీ కోల్‌కతా విజేతగా నిలిచింది.

Advertisement

 విజ్డెన్ ట్రోఫీ–2020

ఇంగ్లాండ్–వెస్టిండిస్‌ మధ్య జులై 28న జరిగిన  విజ్డెన్ ట్రోఫీ–2020   ఫైనల్ మ్యాచ్‌లో  ఇంగ్లాండ్ 2–1 తేడాతో విజయం సాధించింది.  16 వికెట్లు సాధించిన స్టూవార్డ్‌ బ్రాడ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్ సిరిస్‌ను సాధించాడు. 363పరుగులు సాధించిన బెన్‌ స్టోక్స్‌ అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌‌గా నిలిచాడు. 1963 నుంచి ఇంగ్లాండ్–వెస్టిండిస్ మధ్య జరుగుతున్న ఈ టెస్ట్‌ సిరిస్‌లో అత్యధికంగా 14 సార్లు వెస్టిండిస్ గెలుచుకుంది. ఈ ట్రోఫిని ఇక నుంచి రిజర్డ్‌ బోథమ్ ట్రోఫీగా వ్యవహరించనున్నారు.

 ప్రొ టెన్నిస్ విజేతగా హైదరాబాదీ

Advertisement

ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూటీఆర్ ప్రొ టెన్నిస్ సిరీస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన   క్రీడాకారిణి యడ్లపల్లి ప్రాంజల మహిళల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచింది. మెల్‌బోర్న్‌లో జరిగిన ఫైనల్లో 6-3, 6-3తో డబుల్స్‌లో ప్రపంచ 37వ ర్యాంకర్ డెసిరే క్రాజిక్ (అమెరికా)పై  విజయం సాధించింది.

ఒలింపిక్ సంఘం కొత్త లోగో

  ఇండియన్  అథ్లెట్లు ఒలింపిక్స్‌లో  ప్రాతినిథ్యం వహించి  వంద ఏండ్లు  పూర్తి చేసుకున్న సందర్భంగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) కొత్త లోగోను తయారు చేసింది. దీనికి  అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ఆమోద ముద్ర వేసింది. ఆగస్టు 15న  అధికారికంగా లోగోను ఆవిష్కరించనున్నారు.

Advertisement

నంబర్‌‌ 1 ర్యాంకులో అమిత్‌

 అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ-ఐబా)  జూలై 6న విడుదల చేసిన  వరల్డ్‌ ర్యాంకింగ్‌‌లో  ఇండియన్ బాక్సర్ అమిత్ పంఘాల్  పురుషుల 52 కేజీల విభాగంలో 1300 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించాడు.  ప్రపంచ చాంపియన్ జైరోవ్ షకోబిదిన్ (ఉజ్బెకిస్తాన్) 1200 పాయింట్లతో రెండో ర్యాంక్‌,  అసెనోవ్ పనేవ్ (బల్గేరియా) 1000 పాయింట్లతో మూడో ర్యాంక్‌లో ఉన్నాడు.

ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్

Advertisement

జులై 5న జరిగిన ఆస్ట్రియన్ గ్రాండ్ ప్రిక్స్ 2020 ఫార్ములావన్ పోటీలలో వాల్బెరి బొటాస్ (మెర్సిడెస్) విజయం సాధించాడు. చార్లెస్ లెక్లెర్క్‌(ఫెర్రారి), లాండో నో రిస్ (మెక్‌లారెన్‌) లు తరువాతి స్థానాల్లో నిలిచారు. గతంలో ఆరుసార్లు ఫార్ములావన్ చాంపియన్‌గా నిలిచిన లెవిస్ హామిల్టన్ (మెర్సిడెజ్‌) నాల్గో స్థానానికి పరిమితమయ్యారు.

వరల్డ్‌ టీమ్‌లోకి  వీనస్

అమెరికా టెన్నిస్ స్టార్ వీనస్ విలియమ్స్ ప్రపంచ టీమ్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) టోర్నీలో పాల్గొననుంది. తొమ్మిది జట్లు తలపడే ఈ టోర్నీలో ఆమె బరిలోకి దిగడం ఇది 15వ సారి. తాజాగా ఆమె వాషింగ్టన్ కాజిల్స్ తరఫున పోటీపడనుంది. మూడు వారాల పాటు జరిగే ఈ ఈవెంట్ 2020, జూలై 12న ప్రారంభం కానుంది.  వీనస్ ఖాతాలో ప్రస్తుతం ఏడు గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిళ్లు ఉన్నాయి. సోదరి సెరెనాతో కలిసి 14 గ్రాండ్‌స్లామ్ డబుల్స్ ట్రోఫీలు కూడా గెలుచుకుంది.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!