Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జులై 2020

కరెంట్​ అఫైర్స్​: జులై 2020

నేషనల్‌

కార్బెట్ రిజర్వ్‌లో 231 పులులు

జూలై 29న గ్లోబల్ టైగర్ డే సందర్భాన్ని పురస్కరించుకొని 2019 ఏడాది చేపట్టిన పులుల గణన ఆధారంగా కేంద్ర ప్రభుత్వం జూలై 28న ఒక నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం… దేశవ్యాప్తంగా ఉన్న 50 టైగర్ రిజర్వ్‌లలో ఉత్తరాఖండ్‌లో కార్బెట్ టైగర్ రిజర్వ్‌లో అత్యధికంగా 231 పులులు, ఆ తర్వాత కర్ణాటకలోని నాగర్‌హోల్‌లో 127, బందీపూర్‌లో 127 పులులు ఉన్నాయి. మిజోరంలోని డంపా, బెంగాల్‌లోని బుక్సా, జార్ఖండ్‌లో పాలమూ రిజర్వ్‌లలో ఒక్క పులీ మిగల్లేదు.

రాజ్యసభలో ప్యానల్ చైర్మన్స్‌

రాజ్యసభ, వైస్ చైర్మన్‌లు లేని సమయంలో సభా కార్యక్రమాలు నిర్వహించడానికి ఆరుగురు సభ్యులతో ప్యానల్ ఆఫ్ చైర్మన్స్‌ను నియమించారు. వీరిలో భువనేశ్వర్ కలిటా, సురేంద్రసింగ్ నాగల్(బీజేపీ), ఎల్‌ .హన్మంతయ్య(కాంగ్రెస్‌), వందనా చవాన్‌( నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ), సుఖేందు శేకర్‌‌ రాయ్‌( ఆలిండియా తృణముల్‌ కాంగ్రెస్‌), సుస్మిత్ పాత్ర(బిజూ జనతాపార్టీ) ఉన్నారు.

తొలి తేనే పరీక్షా కేంద్రం

ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రపంచస్థాయి తొలి తేనే పరీక్షా కేంద్రాన్ని గుజరాత్‌లోని ఆనంద్‌లో జులై 25న ఏర్పాటు చేశారు. సమగ్ర ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమం, జాతీయ తేనేటీగల పెంపక విధానంలో భాగంగా ఏర్పాటు చేసిన ఈ ప్రయోగ శాలకు నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్‌ ఆఫ్ టెస్టింగ్ అండ్ కాలిబరేషన్ లాబరేటరీస్(ఎన్‌ఏబీఎల్‌) ఆమోదం తెలిపింది.

స్వచ్ఛ భారత్‌–2

గ్రామాలను  పరిశుభ్రంగా మార్చేందుకు చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం రెండో విడతను జులై 17న ప్రారంభించారు. ఇందుకోసం రూ. రూ.1,40,881 కోట్లను కేటాయించారు. మొదటి విడత స్వచ్ఛ భారత్‌  2014  అక్టోబర్ 02న  ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. గ్రామాలు,పట్టణాల అభివృద్ధికి రూ. 62,009 కోట్లను ఖర్చుపెట్టారు.

గోదాన్ న్యాయ యోజన

చత్తీస్‌గఢ్ ప్రభుత్వం హరేలి ఉత్సవాల సందర్భంగా జులై 20 గోదాన్ న్యాయ్‌ యోజన పథకాన్ని ప్రారంభించింది. రైతుల దగ్గర నుంచి పశువుల పేడను కిలో రూ.2 చొప్పున సేకరించి సబ్సిడీతో సహకార సంఘాలకు అందిస్తుంది. దానిని వర్మీ కంపోస్ట్‌గా మార్చి తిరిగి రైతులకు ఎరువుగా అమ్మనున్నారు.పశువుల పెంపకాన్ని లాభదాయకం చేయడం, ఉపాధి కల్పన , సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ఈ పథకం ఉద్దేశం.

విద్యుత్ రంగంలో డ్రోన్లు

హైవోల్టేజీ విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌మిషన్ టవర్స్‌ను ఏరియల్ సర్వే చేసేందుకు డ్రోన్లను ఉపయోగించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ పంపిణీలో అవాంతరాల తొలగించి సిబ్బందికి ఒత్తిడి తగ్గించడం దీని ప్రధాన లక్ష్యం. దీని కోసం 50 మీటర్ల ఎత్తు ఎగిరే 16 డ్రోన్ల కోసం అనుమతి పొందారు. దీంతో విద్యుత్ రంగంలో డ్రోన్ల ఉపయోగించిన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలవనుంది.

అతిపెద్ద సోలార్ ప్లాంట్

ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ను   ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు.  మధ్యప్రదేశ్‌ల రాష్ట్రంలోని రేవా జిల్లాలో నిర్మించిన ఈ ప్లాంట్ 750 మెగావాట్ల సామర్థ్యం కలది.  1590 ఎకరాలలో 250 మెగావాట్ల సామర్థ్యం మూడు బ్లాకులను ఇందులో నిర్మించారు. ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో 24శాతం ఢిల్లీ మెట్రో కోసం వినియోగించనున్నారు. ఏటా 15లక్షల టన్నుల కర్పన ఉద్గారాలను ఈ సోలార్ ప్లాంట్ తగ్గించనుంది.  మధ్యప్రదేశ్ ఊర్జా వికాస్ నిగమ్, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆప్ ఇండియా సంయుక్తంగా నిర్మించిన సోలార్ ప్లాంట్‌కు ప్రపంచ బ్యాంక్ వడ్డీ మినహాయింపును ఇచ్చింది.

పద్మనాభ ఆలయ హక్కులపై తీర్పు

 కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయ యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు  తీర్పు వెలువరించింది. 2011లో కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు  దేవాలయ పరిపాలనా హక్కులు ట్రావెన్‌కోర్ రాజకుటుంబానికే చెందుతాయని తెలిపింది.  దాదాపు 9 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాలకు ముగింపు పలుకుతూ జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం  జూలై 13న తుది తీర్పు వెలువరించింది.

పులుల గణనలో గిన్నిస్ రికార్డు

పులుల సంఖ్యను తెలుసుకునేందుకు 2018లో భారత ప్రభుత్వం చేపట్టిన పులుల గణన గిన్నిస్ రికార్డు సాధించింది.  ప్రపంచంలో కెమెరాల ద్వారా చేపట్టిన అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా నిలిచింది. దీనికోసం 141 ప్రాంతాల్లో  26,838 కెమెరాలను అమర్చి లక్షా 21వేల 337 చదరపు మీటర్ల దూరాన్ని పరిశీలించారు. ఈ సర్వే ద్వారా దేశంలో 2,967 పులులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం 3,48,58,623 ఫొటోలను తీశారు. మధ్యప్రదేశ్‌(526), కర్ణాటక(524), ఉత్తరాఖండ్(442)లో అత్యధికంగా పులులు ఉండగా తెలంగాణాలో 26, ఏపీలో 48  ఉన్నట్టు తేల్చారు.

ఈ–లోక్‌ అదాలత్‌

కోవిడ్ –19 కారణంగా జాతీయ లోక్ అదాలత్ రద్దు కావడంతో చత్తీస్‌గఢ్ హైకోర్ట్‌ చీఫ్ జస్టిస్ రామచంద్ర మినన్‌ రాష్ట్ర స్థాయి లోక్ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించారు. తద్వారా ఈ–లోక్‌ అదాలత్ నిర్వహించిన తొలి రాష్ట్రంగా చత్తీస్‌గఢ్‌ నిలిచింది. రాష్ట్రంలోని 195 కేంద్రాలలో దీనిని నిర్వహించారు. జాతీయ లోక్‌అదాలత్ 2020లో ఫిబ్రవరి 8న తొలిసారి నిర్వహించారు.  ఏప్రిల్ 11, జులై 11 న నిర్వహించాల్సిన సమావేశాలు రద్దయ్యాయి.

యూనిఫిల్ ఎన్విరాన్‌మెంట్ అవార్డు

వ్యర్ధాల తగ్గింపు, రీసైక్లింగ్, అడవుల పెంపకం వంటి అంశాలలో చేసిన కృషికి గాను ఇండియన్ బెటాలియన్‌(ఐఎన్‌డీబీఏటీటీ)కి యునైటెడ్  నేషన్స్ ఇంటెరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్‌ అవార్డు లభించింది.  2019లో స్థాపించిన ఈ అవార్డును ఈ ఏడాది మిషన్ హెడ్  కమాండర్ మేజర్ జనరల్ స్టెఫనో డెల్ కోల్ బెటాలియన్‌కు  అందజేశారు.

ఆత్మనిర్భర్ యాప్ చాలెంజ్

స్వదేశీ యాప్‌ల రూపకల్పనను ప్రోత్సహిస్తూ  ‘ఆత్మనిర్భర్ యాప్ చాలెంచ్’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ జులై 4న ప్రారంభించారు.  కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ, అటల్ ఇన్నోవేషన్ మిషన్ కలిసి ఈ చాలెంజ్‌ను నిర్వహిస్తున్నాయి. ఆసక్తి ఉన్న యువత జులై 18లోగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అగ్రిటెక్, వినోదం, ఆరోగ్యం, ఈ లెర్నింగ్, ఆర్థిక, సాంకేతిక, వార్త రంగాలో ఈ చాలెంచ్ నిర్వహిస్తున్నారు. గెలుపొందిన వారికి 6.4కోట్ల ప్రైజ్ మనీ ప్రకటించారు.

లడక్‌లో గ్రీన్‌హౌజ్ ప్రాజెక్ట్‌

కేంద్రపాలిత ప్రాంతమైన లడక్‌లో జులై 4న  లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణ మాధుర్  గ్రీన్ హౌజ్ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించారు. దీనిని మిషన్‌ ఆర్గానిక్ డెవెలప్ మెంట్ ఇన్నోవేషన్ (మోడీ) గా వ్యవహరిస్తున్నారు. రూ.500కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏడాది పొడవునా కూరగాయాలు అందుబాటులో ఉండే విధంగా 1676 గ్రీన్‌హౌజ్‌లు ఏర్పాటు చేయనున్నారు.

మిషన్ వృక్షారోపన్

మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ జులై 5న ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మిషన్ వృక్షారోపన్ –2020 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.  25 కోట్ల మొక్కల పెంపకం లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని లక్నో సమీపంలోని కుక్కాల్ అటవీ ప్రాంతంలో ప్రారంభించారు. ఇందులో భాగంగా ఆయుర్వేద, ఔషద, పశుగ్రాసం వంటి సుమారు 201 జాతుల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వగా తొలిరోజే 5కోట్ల మొక్కలు నాటారు.

ఎలిమెంట్ యాప్

ఎనిమిది భాషలతో రూపొందించిన స్వదేశీ  సోషల్ మీడియా యాప్‌ ‘ఎలిమెంట్‌’ను భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జులై 5న ప్రారంభించారు.  ఆర్ట్ ఆఫ్ లింగ్ రవిశంకర్ ఆధ్వర్యంలో సుమేరు సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వారు ఈ యాప్‌నకు రూపకల్పన చేశారు.

ప్రభుత్వ భూముల రక్షణకు ‘బ్లుయీస్’

ప్రభుత్వ భూముల రక్షణ కోసం అంతరిక్ష సాంకేతిక, కృత్రిమ మేథాను ఉపయోగిస్తున్న తొలి రాష్ట్రంగా ఒడిషా నిలిచించి.  జులై  8న ఆ రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌‌లో బ్లుయీస్( భువనేశ్వర్ లాండ్ యూజ్ ఇంటెలిజెన్స్ సిస్టమ్) అనే వెబ్ పోర్టల్‌ను ప్రారంభించారు. దీని ఆధారంగా హై రిజల్యూషన్ తో భూములకు సంబంధించిన ఫొటోలను పొందవచ్చు.

తొలి మెరైన్ క్లస్టర్

గోవా ప్రభుత్వం 49 సూక్ష్మ , చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో దేశంలోనే తొలిసారిగా మెరైన్ క్లస్టర్‌‌ను ఏర్పాటు చేస్తోంది. దీని కోసం 14,380 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది. స్వదేశీ అవరసరాల కోసం, యూరప్–ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వాడే పడవలను ఇందులో నిర్మించనున్నారు.

స్కిల్ కనెక్ట్ పోర్టల్

కర్నాటక ప్రభుత్వం జూన్ 30న స్కిల్ కనెక్ట్ పోర్టల్‌ను ప్రారంభించింది.  కోవిడ్–19 ప్రభావంతో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, వలస వెళ్లిన కార్మికుల స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించేందుకు పరిశ్రమలకు, వివిధ   సంస్థలకు వారధిగా ఉండేందుకు  ఈపోర్టల్ ఉపయోగపడనుంది.

నాడా ఇండియా  యాప్

నిషేధిత ఉత్ప్రేరకాల విషయంలో భారత క్రీడాకారులకు మరింత అవగాహన పెంచే కార్యక్రమంలో భాగంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) అభివృద్ధి చేసిన ‘నాడా ఇండియా’ మొబైల్ యాప్ ను విడుదల చేసింది.  ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) జాబితాలో ఉన్న నిషేధిత ఉత్ప్రేరకాల మొత్తం సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది.

తొలి ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సు

ప్రపంచంలోనే తొలిసారిగా ఐఐటీ మద్రాస్ ఆన్‌లైన్ ద్వారా ప్లానింగ్ అండ్ డేటా మేనేజ్‌మెంట్ రంగంలో బీఎస్సీ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.  ఇందుకోసం రూ. 3వేలు అప్లికేషన్ ఫీజును ఖరారు చేసింది.  మ్యాథ్స్, ఇంగ్లిష్, స్టాటిస్టిక్స్, కంప్యూటేషనల్ థింకింగ్ క్లాసులు నిర్వహించి ఆన్‌లైన్లో పరీక్షలు నిర్వహించనుంది. రాబోయే కాలంలో ఈ రంగంలో  11.5 మిలియన్ల ఉద్యోగాలు రానున్నాయని మద్రాస్ ఐఐటీ ప్రకటించింది.

గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ అభియాన్

వలస కూలీలకు ఉపాధి అవకాశాలను విస్తృత స్థాయిలో తీసుకురావడానికి రూ.50వేల కోట్లతో గరీబ్ కల్యాణ్ రోజ్‌గార్ యోజన పథకాన్ని కేంద్రం ప్రారంభించింది. దీనికి సంబంధించిన వెబ్‌ పోర్టల్‌ను  కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జులై 01న  ఆవిష్కరించారు.  బిహార్, జార్ఖాండ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఒడిషా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో 116 జిల్లాలో ఈ స్కీం అమలు కానుంది.

గోదాన్ న్యాయ యోజన

చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో జులై 20న జరిగే హరేలి ఉత్సవం సందర్భంగా అక్కడి ప్రభుత్వం గోదాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రారంభించనుంది. నిర్ణీత ధరకు రైతుల నుంచి పేడను సేకరించి సహకార సంఘాల ద్వారా వర్మీ కంపోస్ట్‌గా మార్చి విక్రయించడం ఈ స్కీం ముఖ్య ఉద్దేశ్యం. రైతులకు ఆదాయం, సేంద్రియ వ్యవసాయం ప్రోత్సహించడం గోదాన్ న్యాయ యోజన ప్రధాన లక్ష్యం.

సంకల్ప్ సర్వే

పర్యావరణ పరిరక్షణలో భాగంగా భారత సాంస్కృతిక వ్యవహారాల శాఖ సంకల్ప్ సర్వేను చేపట్టింది. జూన్ 28న ప్రారంభమైన ఈ కార్యక్రమం జులై 28 వరకు కొనసాగనుంది. భారతదేశానికి వారసత్వ పునాదిగా నిలిచే మర్రి, ఉసిరి, రావి, బిల్వ, అశోక వృక్షం వంటి మొక్కలను సంకల్ప్ సర్వేలో భాగంగా నాటనున్నారు.

హమరా ఘర్–హమరా విద్యాలయ

కోవిడ్‌–19 నేపథ్యంలో స్కూళ్లకు దూరమైన స్టూడెంట్స్‌కు కోసం ఆన్‌లైన్ పాఠాలను బోధించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం జులై 6న ‘హమరా ఘర్–హమరా విద్యాలయా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి వరకు ఒక్కో గంటలకు ఒక్కో సబ్జెక్ట్ చొప్పున పాఠాలను బోధించనున్నారు.

merupulu.com
RELATED ARTICLES
text books free download
indian constitution
LATEST
telangana history
PRACTICE TEST
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

x
error: Content is protected !!