Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​: జులై 2020

కరెంట్​ అఫైర్స్​: జులై 2020

సైన్స్ అండ్ టెక్నాలజీ

అనాసిస్‌–II

Advertisement

 ఆర్మీ, నేవీ, ఎయిర్‌‌ఫోర్స్‌ శాటిలైట్‌ ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌–II  (అనాసిస్‌)  దక్షిణ కొరియా తొలి మిలటరీ కమ్యూనికేషన్ శాటిలైట్‌ను జులై 20న ప్రయోగించారు. దీని ద్వారా స్వంత మిలటరీ కమ్యూనికేషన్ వ్యవస్థ కలిగిన 10వ దేశంగా నిలిచింది. అమెరికా సంస్థ స్పేస్–10 రూపొందించిన ఫాల్కన్ –9 రాకెట్ ద్వారా జియో స్టేషనరీ స్పేస్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టారు.

హోప్‌ ప్రోబ్‌ మిషన్‌

యూనైటెడ్ ఆరబ్‌ ఎమిరేట్స్‌ మార్స్‌పైకి ప్రయోగించిన తొలి వ్యోమనౌక హోప్‌ప్రోబ్‌ మిషన్‌. జపాన్‌లోని తానేగషిమ స్పేస్ సెంటర్‌‌ నుంచి హెచ్‌–11ఏ రాకెట్ ద్వారా ప్రయోగించారు. దీనిని ఎమిరేట్స్ మార్స్‌ మిషన్ అని కూడా వ్యహరిస్తున్నారు. 200 మిలియన్ డాలర్ల ప్రాజెక్ట్‌ ద్వారా మార్స్ వాతావరణాన్ని దానిపై సంభవించే తుఫాన్లను అధ్యయనం చేయడం దీని లక్ష్యం.

Advertisement

సమాదాన్‌ సే వికాస్‌

దీర్ఘ కాలిక రుణాల పరిష్కారం కోసం వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌కు అవకాశం కల్పిస్తూ  ద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం సమాధాన్ సే వికాస్‌. వాయిదాలు చెల్లించని వ్యాపారులు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు, ఒకే సారి వంద శాతం చెల్లిస్తే వడ్డీలో 75శాతం, 50 తం రుణం చెల్లిస్తే  50శాతం వడ్డీ మాఫీ చేయనున్నారు.

వన్‌ స్టాప్‌ షాప్‌

Advertisement

కోవిడ్‌–19  నేపథ్యంలో పరిశ్రమల అనుమతులు తొందరగా పూర్తి చేసేందుకు, భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు రాజస్థాన్ చేపట్టిన పథకం ‘వన్‌ స్టాప్‌ షాప్‌’.  గతంలో దీనిని సింగిల్ విండో క్లియరెన్స్‌ సిస్టం అని వ్యవహరించారు. రూ.10 కోట్ల కన్నా ఎక్కువ పెట్టబడులు పెట్టే పారిశ్రామిక వేత్తలకు అవరసరమైన 98 రకాల అనుమతులను ఒకేసారి జారీ చేస్తారు.

 మనో దర్పన్ పోర్టల్‌

కోవిడ్–19  విజృంభన కారణంగా స్టూడెంట్స్, పేరెంట్స్,  టీచర్లలో ఏర్పడిన మానసిక సమస్యలను తీర్చేందుకు  ద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ‘మనోదర్పన్’ అనే పోర్టల్‌ ను ప్రారంభించింది. దీనిలో సలహాలు, వీడియోలు, ప్రశ్నలు, సమాధానాలు ఉంటాయి. సైకో థెరపిస్టులతో చాటింగ్ రూపంలో సలహాలు తీసుకోవచ్చు.  8448440632 అనే టోల్‌ ఫ్రీ నంబర్ ద్వారా మాట్లాడేందుకు అవకాశం కల్పించారు.

Advertisement

ఇస్రో చైర్మన్‌కు వాన్ కర్మన్  అవార్డు

స్పేస్ టెక్నాలజీలో విశేష కృషి చేసినందుకు  ఇస్రో చైర్మన్ శివన్‌కు  ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఆస్టోన్రాటిక్స్ సంస్థ (ఐఏఏ)  వాన్ కర్మన్ అవార్డును ప్రకటించింది.  2021  మార్చిలో పారిస్ వేదికగా జరిగే కార్యక్రమంలో శివన్ ఈ అవార్డును  అందుకోనున్నారు. హంగేరి–అమెరికన్‌ గణిత శాస్త్రవేత్త, స్పేస్ సైంటిస్ట్‌ థియోడోర్ వాన్ కర్నన్‌ పేరు మీద 1982 నుంచి ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు.  గతంలో భారత్ నుంచి ఈ అవార్డును యూఆర్ రావు(2005), కస్తూరి రంగన్(2007) అందుకున్నారు.

భూమికి  చేరువలో తోకచుక్క

Advertisement

దాదాపు 460 కోట్ల ఏళ్లక్రితంనాటి దుమ్ము, ధూళితో నిండినఈ ‘నియోవైస్’ తోకచుక్క భూమికి చేరువగా వచ్చింది. Edu newsఉత్తరధృవప్రాంతంలో ఆకాశంలో కనిపిస్తున్న ఈ తోకచుక్కను 2020, మార్చి నెలలో నాసాకు చెందిన నియోవైస్ ఇన్‌ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. దాదాపు ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ తోకచుక్క 2020, ఆగస్ట్ 15వ తేదీదాకా మనకు కనిపించి ఆ తర్వాత మన సౌరకుటుంబం నుంచి సుదూరతీరాలకు వెళ్లనుంది. 1990ల తర్వాత ఉత్తరధృవంలో ఇంతటి కాంతివంతమైన తోకచుక్క కనిపించడం ఇదే తొలిసారికావడం విశేషం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు ఇప్పటికే దీని అందమైన ఫొటోలను కెమెరాల్లో బంధించారు.

ఇండియాలో గూగుల్ పెట్టుబడులు

ఇండియాలో   రూ. 75 వేల కోట్లు  పెట్టుబడులు పెట్టనున్నట్టు గూగుల్ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు.  జులై 13న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో భాగంగా గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్న తెలిపారు. ఈక్విటీ, పార్టనర్‌‌షిప్, ఆపరేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్  వంటి వాటిల్లో  పెట్టుబడులు ఉంటాయని  ప్రకటించారు.

Advertisement

అసీమ్ పోర్టల్

ఆత్మనిర్భర్ స్కిల్డ్‌ ఎంప్లాయి ఎంప్లాయర్ మ్యాపింగ్ పోర్టల్( అసీమ్‌) ను జులై 10 కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖా మంత్రి మహేంద్రనాథ్ పాండే ప్రారంభించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ పోర్టల్ బెటర్ ప్లేస్ అనే కంపెనీ డెవలప్ చేసింది. ఉద్యోగాలు కావాలనుకునే యువతకు, సంస్థలకు వారధిగా పనిచేస్తుంది.

దర్పన్ పోర్టల్

Advertisement

ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాల వివరాలను పారదర్శకంగా, సమర్ధవంతంగా నిర్వహించేందుకు చత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం  ప్రారంభించిన వెబ్‌ పోర్టల్‌ దర్పణ్​.  దీనికి ఎలైట్స్ ఎక్సలెన్స్ అవార్డు –2020 లభించింది. 

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!