తెలంగాణ గురుకులాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి మరో రెండు నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వీటి ద్వారా 797 పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ని రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో ఉన్న ఫిజికల్ డైరెక్టర్, క్రాఫ్ట్ టీచర్, లైబ్రేరియన్ పోస్టులకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు (TREI RB) ఈ నోటిఫికేషన్లను రిలీజ్ చేసింది. ఇప్పటికే జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ లెక్చరర్లు, పీజీటీ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్లు వెలువడ్డాయి.
మొత్తం పోస్టులు 797
లైబేరియన్ పోస్టులు | 434 |
క్రాఫ్ట్ టీచర్ పోస్టులు | 88 |
ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు | 275 |
ఈ పోస్టులకు ఈ రోజు (ఈ నెల 24వ తేదీ) నుంచి ఆన్లైన్ లో అప్రికేషన్లు స్వీకరించనున్నారు. మే నెల 24వ తేదీ సాయంత్రం వరకు అప్లికేషన్లకు తుది గడువుగా నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ముందుగా వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) నమోదు చేసుకోవాలి. ఓటీఆర్ ఆధారంగా ఆయా పోస్టులకు అప్లై చేసుకునే అవకాశముంటుంది. పోస్టులకు అర్హతలతో పాటు ఎక్కడెక్కడ ఖాళీలున్నాయి, రిక్రూట్మెంట్ పరీక్ష సిలబస్, పరీక్ష విధానం డిటైల్డ్ నోటిఫికేషన్లో అందుబాటులో ఉంటుంది. అన్ని పోస్టులకు సంబంధించిన డిటైల్డ్ నోటిఫికేషన్ పీడీఎఫ్లు అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా పోస్టు చివరన ఉన్నాయి.