Homeస్టడీ అండ్​ జాబ్స్​Current Affairsకరెంట్​ అఫైర్స్​ : జూన్​ ​2024

కరెంట్​ అఫైర్స్​ : జూన్​ ​2024

అంతర్జాతీయం

సునీతా విలియమ్స్ అంతరిక్ష ప్రయాణం
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్‌, మరో వ్యోమగామి బుచ్​ విల్​మోర్​తో కలిసి బోయింగ్‌ కంపెనీకి చెందిన స్టార్‌లైనర్‌ లో అంతరిక్ష ప్రయాణం ప్రారంభించారు. ‘నాసా’ ఆధ్వర్యంలో ఫ్లోరిడాలోని కేప్‌ కెనావెరాల్‌ స్పేస్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి ఈ ప్రయాణం అరంభమైంది.

ఐస్‌లాండ్‌ అధ్యక్షురాలిగా థామస్‌డాటర్‌
ఐస్‌లాండ్‌ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్‌డాటర్‌ ఎన్నికయ్యారు. 34.3శాతం ఓట్లు సాధించిన హల్లా థామస్‌డాటర్‌ మాజీ ప్రధాని కట్రినా యాకబ్స్‌డాటర్‌ (25.2%)పై విజయం సాధించారు. హల్లా ఆగస్టు 1న అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

జాబిల్లి రెండోవైపు దిగిన చాంగే-6
చంద్రమండల యాత్రల్లో చైనా మరో ముందడుగు వేసింది. ఈ దేశానికి చెందిన చాంగే-6 వ్యోమనౌక విజయవంతంగా జాబిల్లి రెండోవైపు దిగింది. అక్కడి నమూనాలను సేకరించిన తర్వాత ఇది తిరిగి భూమికి బయల్దేరనుంది. 2019లో చాంగే-4ను చంద్రుడి రెండోవైపునకు ప్రయోగించింది.

భద్రతా మండలికి కొత్తగా ఐదు దేశాలు
ఐక్యరాజ్యసమితిలోని ప్రధానమైన భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశాల కోటాలో 5 దేశాలు (సోమాలియా, పాకిస్తాన్‌, పనామా, డెన్మార్క్, గ్రీస్‌) ఎన్నికయ్యాయి. ఈ దేశాలు 2025 జనవరి నుంచి 2026 డిసెంబర్ 31 వరకు రెండేళ్ల పాటు శాశ్వతేతర సభ్య హోదాలో కొనసాగుతాయి.

సింగపూర్​ ప్రధానిగా లారెన్స్​ వాంగ్​
సింగపూర్‌ నాలుగో ప్రధానిగా ఆర్థికవేత్త లారెన్స్‌ వాంగ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాల పాటు లీ సీన్‌ లూంగ్‌ ప్రధానిగా వ్యవహరించగా.. వాంగ్‌ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. వీరిద్దరూ పాలక పీపుల్స్‌ యాక్షన్‌ పార్టీకి చెందిన వారు.

ఐస్‌లాండ్‌ అధ్యక్షురాలిగా హల్లా థామస్‌డాటర్‌
ఐస్‌లాండ్‌ అధ్యక్షురాలిగా వ్యాపారవేత్త హల్లా థామస్‌డాటర్‌ ఎన్నికయ్యారు. 34.3శాతం ఓట్లు సాధించిన హల్లా థామస్‌డాటర్‌ తన సమీప ప్రత్యర్థి, మాజీ ప్రధాని కట్రినా యాకబ్స్‌డాటర్‌ (25.2%)పై విజయం సాధించారు. ప్రస్తుత అధ్యక్షుడు జి.టి.యోహాన్నెసన్‌ స్థానంలో హల్లా థామస్‌డాటర్‌ బాధ్యతలు చేపట్టనున్నారు.

నాటో సెక్రటరీ జనరల్​గా మార్క్‌ రుట్టె
నెదర్లాండ్స్‌ నేత మార్క్‌ రుట్టె నాటో కూటమి సెక్రటరీ జనరల్‌గా ఎన్నిక కానున్నారు. ఈ పదవి కోసం పోటీపడ్డ రుమేనియా అధ్యక్షుడు క్లాస్‌ యెహానిస్‌ బరి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. దీంతో రుట్టె ఒక్కరే పోటీలో మిగిలారు.

చైనా చాంగే 6 రికార్డ్​
చైనా ప్రయోగించిన లూనార్ ప్రోబ్ చాంగే -6 మిషన్ చంద్రుడి అవతలి వైపు నుంచి మట్టిని సేకరించి భూమికి తీసుకువచ్చిన మొట్టమొదటి మిషన్​ గా రికార్డ్​ సృష్టించింది. 53 రోజుల ప్రయాణం తర్వాత చంద్రుడిని చేరుకొని రోబోటిక్ ల్యాండర్ సాయంతో మట్టిని సేకరించి భూమిని చేరుకుంది.

తీస్తా నదీజలాలపై భారీ ప్రాజెక్టు
భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్​ ప్రధాని షేక్​ హసీనాతో భారత ప్రధాని మోడీ జరిపిన చర్చల్లో తీస్తా నదీ జలాలను పరిరక్షించుకునే భారీ ప్రాజెక్టు నిర్మాణంతో పాటు డిజిటల్‌ రంగం, నౌకాయానం, రైల్వే, అంతరిక్షం, హరిత సాంకేతికత, వైద్యం- ఔషధాలు వంటి రంగాల్లోనూ ఒప్పందాలు కుదిరాయి

సింగపూర్‌ నుంచి అత్యధిక ఎఫ్‌డీఐ
2023-–24 ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అత్యధిక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్‌డీఐ) సింగపూర్‌ నుంచి లభించిందని ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. రెండో స్థానంలో మారిషస్‌ నిలిచింది. మన దేశానికి వచ్చిన ఎఫ్‌డీఐ 2022–-23తో పోలిస్తే 3.5 శాతం తగ్గింది.

ఆసియా ధనవంతుడు అదానీ
అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచీ ప్రకారం, 111 బిలియన్‌ డాలర్లతో అదానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో 11వ స్థానంలో నిలిచారు. అంబానీ 109 బి.డాలర్ల సంపదతో 12వ స్థానం దక్కించుకున్నారు.

‘రుద్ర ఎమ్‌-2’ పరీక్ష విజయవంతం
భారత్ స్వదేశీ అభివృద్ధి చేసిన ఉపరితల యాంటీ-రేడియేషన్ మిసైల్ రుద్ర ఎమ్-2 ను డీఆర్​డీవో ఒడిశాలోని చండీపూర్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. శత్రు నిఘా రాడార్లను లక్ష్యంగా చేసుకోవడానికి రూపొందించబడిన ఈ మిసైల్ డిఫెన్స్​లో ఉపయోగపడుతుంది.

భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణం
భారతదేశ ప్రధానమంత్రిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టారు. తొలి ప్రధాని నెహ్రూ తర్వాత ఈ ఘనత సాధించిన నాయకునిగా రికార్డుల‌కెక్కారు. మోదీ సహా 72 మందితో పూర్తిస్థాయి నూతన కేంద్ర మంత్రివర్గం కొలువుదీరింది. 30 మంది కేబినెట్‌ మంత్రులుగా, ఐదుగురు స్వతంత్ర, 36 మందితో సహాయ మంత్రులుగా రాష్ట్రపతి ప్రమాణస్వీకారం చేయించారు.

మొదటి ఆస్ట్రో టూరిజం ప్రారంభం
ఉత్తరాఖండ్ రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి ఆస్ట్రో టూరిజం కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. ఈ కార్యక్రమానికి ‘నక్షత్ర సభ’ అని పేరు పెట్టారు. ఆస్ట్రో టూరిజం ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులు, యాత్రికులను ఆకర్షించడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది.

500 బిలియన్‌ డాలర్లకు భారత ఎగుమతులు
భారతదేశ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 60–70 బిలియన్‌ డాలర్ల మేర పెరిగింది. దీంతో 500 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్టర్స్‌ ఆర్గనైజేషన్‌(ఫియో) అంచనా వేసింది. 2023–24లో 437 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి.

ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్‌ చరణ మాఝి
ఒడిశా15వ ముఖ్యమంత్రిగా ఆదివాసీ నేత మోహన్‌ చరణ మాఝి గవర్నర్‌ రఘుబర్‌ దాస్‌ ఆయనతో ప్రమాణం చేయించారు. మొత్తం 147 అసెంబ్లీ స్థానాలకుగాను 78 చోట్ల గెలిచిన బీజేపీ రెండున్నర దశాబ్దాలుగా ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్‌ను ఓడించింది.

అరుణాచల్​ ప్రదేశ్​ సీఎంగా పెమా ఖండూ
అరుణాచల్​ ప్రదేశ్​ ముఖ్యమంత్రిగా వరుసగా మూడోసారి పెమా ఖండూ బాధ్యతలు చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో అరుణాచల్​ ప్రదేశ్​ సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ ఉన్నారు.

ప్రపంచంలోనే ఎత్తయిన వంతెనగా చీనాబ్​
ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెనపై తొలిసారిగా రైలు పరుగులు పెట్టింది. జమ్మూకశ్మీర్‌లోని రియాసీ నుంచి బారాముల్లాకు రైళ్ల పరుగు మొదలైంది. సంగల్‌దాన్‌లో 12.35కు బయలుదేరిన రైలు తొమ్మిది సొరంగాలు దాటి 2.05కు రియాసీకి చేరింది.

జెండర్​ గ్యాప్​ ఇండెక్స్​
ప్రపంచ ఆర్థిక ఫోరం 2024 జూన్‌లో 18వ ఎడిషన్ గ్లోబల్​ జెండర్​ గ్యాప్​ రిపోర్ట్​ విడుదల చేసింది. 146 దేశాలలో ఆరోగ్యం, విద్య, ఆర్థిక వ్యవస్థ, రాజకీయ రంగాలలో లింగ అంతరాలను పర్యవేక్షించగా, అగ్రస్థానంలోఐస్‌లాండ్ నిలిచింది. 2023లో 127వ స్థానంలో ఉన్న భారత్​ ఈ సంవ‌త్సరం 129వ స్థానానికి పడిపోయింది.

అందాల పోటీల్లో డిజిటల్‌ భామ
‘ఫ్యాన్‌వ్యూ’ అనే సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో భారత్‌కు చెందిన జారా టాప్‌-10 తుది జాబితాలో నిలిచింది. ఈ జారా అమ్మాయి కాదు, కృత్రిమ మేధతో (ఏఐ) సృష్టించిన ఓ ‘డిజిటల్‌ భామ’. ‘మిస్‌ వరల్డ్‌’ పోటీల్లాగే ఇందులో గెలిచినవారికి ‘మిస్‌ ఏఐ’ టైటిల్‌ ఇవ్వనుంది.

సైన్యంలో ‘స్కిన్‌ బ్యాంక్​’
భారత సైన్యం తొలిసారిగా ‘చర్మనిధి కేంద్రా’ (స్కిన్‌ బ్యాంకు)న్ని ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా రక్షణశాఖ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

అయోధ్యలో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’
అయోధ్యలో రూ.650 కోట్లతో ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ నిర్మాణానికి టాటా సన్స్‌ చేసిన ప్రతిపాదనకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ‘మ్యూజియం ఆఫ్‌ టెంపుల్స్‌’ కోసం రూ.1 నామమాత్రపు అద్దె ప్రాతిపదికన టూరిజం శాఖకు సంబంధించిన స్థలాన్ని 90 ఏళ్లపాటు లీజుకు ఇవ్వనున్నామన్నారు.

ఎన్‌టీఏ ప్రక్షాళనకు కమిటీ
ఇస్రో మాజీ చైర్మన్‌ కె.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన ఏడుగురు సభ్యులతో జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) సంస్కరణల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పరీక్ష ప్రక్రియ ప్రక్షాళన, డేటా సెక్యూరిటీ ప్రొటోకాల్స్‌ను మెరుగుపరచడం, ఎన్‌టీఏ నిర్మాణం, పని విధానంలో చేపట్టాల్సిన మార్పులు, చేర్పుల గురించి సిఫార్సు చేస్తూ ఈ ఉన్నత స్థాయి కమిటీ నివేదిక సమర్పించనుంది.

ప్రాంతీయం

మాటలు రాని పిల్లలకు ‘అమ్మ’ యాప్‌
మాటలు సరిగా రాని పిల్లల కోసం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్‌ విద్యార్థులు ‘అమ్మ’ పేరిట యాప్‌ ఆవిష్కరించారు. నిట్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ హెడ్‌ డా.కె.వి.కాదంబరి ఆధ్వర్యంలో సీఎస్​ఈ ఇంజినీరింగ్‌ విద్యార్థులు రూపొందించారు.

సిద్ధిపేటలో నిజాం కాలం నాణెలు
సిద్ధిపేట మండలం నర్సాయిపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు రాతి పాత్రలో నిజాం కాలం నాటి 25 వెండి నాణెలు, రెండు వెండి ఉంగరాలు లభ్యమయ్యాయి.

ఇకపై టీఎస్‌ కాదు టీజీ
ఇకపై ప్రభుత్వ శాఖల్లో, ఉత్తర ప్రత్యుత్తరాల్లో అన్నింటా టీఎస్‌కు బదులు టీజీనే వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని సీఎస్​ ఆదేశాలు జారీ చేశారు.

ప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు
హైదరాబాద్‌లోప్రపంచ వరి శిఖరాగ్ర సదస్సు జరిగింది. గతేడాది రాష్ట్రంలోని 1.2 కోట్ల ఎకరాల్లో వరి సాగవగా 26 మిలియన్‌ టన్నుల వరి ఉత్పత్తి జరిగింది. రాష్ట్రంలో దాదాపు 220 రకాల ధాన్యం ఉత్పత్తి జరుగుతోందని మంత్రులు తెలిపారు.

కేంద్ర మంత్రులుగా కిషన్​ రెడ్డి, బండి సంజయ్​
కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీ క్యాబినెట్‌లో కిషన్​ రెడ్డికి బొగ్గు, గనులశాఖ బాధ్యతలను అప్పగించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్​కు అవకాశం దక్కింది.

హార్టికల్చర్​ వర్సిటీకి అవార్డు
శ్రీ కొండాలక్ష్మణ్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని కూరగాయల పరిశోధన కేంద్రానికి జాతీయ ఉత్తమ పరిశోధన కేంద్రంగా 2023–2024 ఏడాదికి గాను అవార్డు దక్కింది. గుజరాత్‌లోని నవసారిలో జరుగుతున్న దుంప పంటలు వార్షిక సమావేశాల్లో ఈ అవార్డు అందుకుంది.

దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్స్​
ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు కనీసం 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘పర్సన్‌ విత్‌ డిజేబిలిటీస్‌–2016’ చట్టానికి అనుగుణంగా ఈ మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పింది.

వార్తల్లో వ్యక్తులు

పాయల్​ కపాడియా
77వ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ 2024 లో కొత్త దర్శకురాలు పాయల్​ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్​ వి ఈమాజిన్​ ఆస్​​ రైట్​’ చిత్రానికి గ్రాండ్​ ప్రిక్స్​ అవార్డు దక్కింది. ఈ అవార్డ్​ అందుకున్న తొలి భారతీయ మహిళా దర్శకురాలిగా పాయల్​ కపాడియా రికార్డ్​ సృష్టించారు. మూడు దశాబ్దాల్లో గ్రాండ్​ ప్రిక్స్​ అవార్డ్​ దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే .

హెలెన్‌ మేరీ
పాకిస్థాన్‌లో తొలిసారి ఆర్మీ మెడికల్‌ కోర్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. పాకిస్థాన్‌ సైన్యంలో బ్రిగేడియర్‌ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

రాధికా సేన్‌
డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో యునైటెడ్‌ నేషన్స్‌ ఆర్గనైజేషన్‌ స్టెబిలైజేషన్‌ మిషన్‌లో పని చేసిన భారతీయురాలైన మహిళా శాంతి పరిరక్షకురాలు మేజర్‌ రాధికా సేన్‌ను ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2023)తో సత్కరించనుంది. 2019లో మొదటిసారిగా ఈ అవార్డును మేజర్‌ సుమన్‌ గవానీ అందుకోగా, రెండోసారి మేజర్‌ రాధికాసేన్‌ అందుకోనున్నారు.

సంజీవ్‌పురి
భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) జాతీయ అధ్యక్షుడిగా ఐటీసీ చైర్మన్, ఎండీ సంజీవ్‌ పురి బాధ్యతలు స్వీకరించారు. 2024-–25 సంవత్సరానికి ఆయన ఈ పదవిలో ఉంటారు. సీఐఐ జాతీయ ఉపాధ్యక్షుడిగా టాటా కెమికల్స్‌ ఎండీ, సీఈఓ ఆర్‌.ముకుందన్‌ వ్యవహరిస్తారు.

డాక్టర్‌ కృష్ణ ఎల్ల
భారత్‌ బయోటెక్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్లకు అమెరికాలోని జాన్స్‌ హాప్‌కిన్స్‌ బ్లూమ్‌బెర్గ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ నుంచి ప్రతిష్టాత్మక డీన్స్‌ మెడల్‌ లభించింది. ప్రజారోగ్య విభాగంలో విశేష కృషి చేసినందుకు ఆయన్ను ఈ పురస్కారంతో గౌరవించింది.

సత్యదీప్‌ గుప్తా
భారత పర్వతారోహకుడు సత్యదీప్‌ గుప్తా అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఎవరెస్టు, లోత్సీ పర్వతాలను ఒకే సీజన్‌లో అధిరోహించడంతోపాటు కేవలం 11 గంటల 15 నిమిషాల వ్యవధిలోనే ఆ యాత్రను పూర్తి చేయడం విశేషం.

శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి
ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణికి ‘షా’ బహుమతి ల‌భించింది. విద్యుదయస్కాంత కిరణాలను వెదజల్లే న్యూట్రాన్ నక్షత్రాలు, నక్షత్రాల పేలుళ్లు, గామా కిరణాల వెల్లువ వంటి విషయాలపై శ్రీనివాస్ రామచంద్ర కులకర్ణి చేసిన విశేష పరిశోధనలకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక షా అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డును అందుకున్న మొదటి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త కులకర్ణి.

చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో రాష్ట్ర గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణం చేయించారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం ఇది నాలుగోసారి. ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో చంద్రబాబుతో కలిపి మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. మంత్రివర్గంలో 8 బీసీ, 5 కమ్మ, 4 కాపు, 3 రెడ్డి, 2 ఎస్సీ, వైశ్య, ఎస్సీ, మైనార్టీలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించారు.

క్లాడియా షేన్‌బామ్‌
మెక్సికో అధ్యక్ష ఎన్నికల్లో అధికార మోరెనా వామపక్ష కూటమి అభ్యర్థి క్లాడియా షేన్‌బామ్‌ ఘనవిజయం సాధించారు. 200 ఏళ్ల స్వతంత్ర మెక్సికో చరిత్రలో దేశ అధ్యక్ష పీఠమెక్కనున్న తొలి మహిళగా రికార్డు సృష్టించారు. యూదు మూలాలున్న తొలి ప్రెసిడెంట్‌ కూడా ఆమే.

జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి
తెలంగాణ స్థిరాస్తి(రియల్‌ ఎస్టేట్‌) అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ చైర్మన్‌గా రిటైర్డ్​ న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, న్యాయ విభాగం సభ్యులుగా న్యాయవాది పల్లె ప్రదీప్‌కుమార్‌రెడ్డి, పరిపాలన, సాంకేతిక సభ్యురాలిగా విశ్రాంత ఐఏఎస్‌ చిత్రా రామచంద్రన్‌ బాధ్యతలు చేపట్టారు.

పాయల్​ కపాడియా
77వ కేన్స్​ ఫిల్మ్​ ఫెస్టివల్​ 2024 లో కొత్త దర్శకురాలు పాయల్​ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్​ వి ఈమాజిన్​ ఆస్​​ రైట్​’ చిత్రానికి గ్రాండ్​ ప్రిక్స్​ అవార్డు దక్కింది. ఈ అవార్డ్​ అందుకున్న తొలి భారతీయ మహిళా దర్శకురాలిగా పాయల్​ కపాడియా రికార్డ్​ సృష్టించారు. మూడు దశాబ్దాల్లో గ్రాండ్​ ప్రిక్స్​ అవార్డ్​ దక్కించుకున్న తొలి భారతీయ సినిమా ఇదే .

హెలెన్‌ మేరీ
పాకిస్థాన్‌లో తొలిసారి ఆర్మీ మెడికల్‌ కోర్‌లో పనిచేస్తున్న డాక్టర్‌ హెలెన్‌ మేరీ రాబర్ట్స్‌ బ్రిగేడియర్‌గా పదోన్నతి పొందారు. పాకిస్థాన్‌ సైన్యంలో బ్రిగేడియర్‌ హోదా పొందిన తొలి మహిళ, క్రైస్తవ మైనారిటీ వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

శ్రీనివాస్ సాదు
హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్ ఫార్మా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అండ్ సీఈఓగా ‘శ్రీనివాస్ సాదు’ను నియమించినట్లు ప్రకటించింది. లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ, న్యూయార్క్ నుంచి ఇండస్ట్రియల్ ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ సాదు పూర్తి చేశాడు.

ఓం బిర్లా
రాజస్థాన్‌లోని కోటా స్థానం నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఓం బిర్లా మరోసారి స్పీకర్‌ అయ్యారు. ఈ పదవికి ఎన్నిక జరగడం 48 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇండియా కూటమి తమ ఉమ్మడి అభ్యర్థిగా కేరళ ఎంపీ కొడికున్నిల్‌ సురేశ్‌ను బరిలోకి దింపింది. మాడభూషి అనంతశయనం అయ్యంగార్, గుర్దయాల్‌సింగ్‌ థిల్లాన్, బలరాం జాఖడ్, జీఎంసీ బాలయోగి తర్వాత రెండోసారి స్పీకర్‌ పదవి చేపట్టిన వ్యక్తిగా బిర్లా రికార్డు సృష్టించారు.

అరుంధతీ రాయ్​
నిజాలను నిస్సంకోచంగా వెల్లడించే రచనలకు గాను బుకర్​ ఫ్రైజ్​ విజేత, ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్​కు పెన్​ పింటర్​ 2024 పురస్కారం దక్కింది. అక్టోబర్ 10న జరిగే కార్యక్రమంలో ఈ అవార్డు అందజేయనున్నారు.

భర్తృహరి మహతాబ్‌
లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఒడిశాకు చెందిన సీనియర్‌ ఎంపీ భర్తృహరి మహతాబ్‌ వ్యవహరించారు. సీనియర్‌ ఎంపీ మహతాబ్‌ స్పీకర్‌ ఎన్నిక పూర్తయ్యే వరకు లోక్‌సభ ప్రిసైడింగ్‌ అధికారిగా కార్యకలాపాలు నిర్వహిస్తారని రిజిజు తెలిపారు.

విక్రమ్‌ సేథ్‌
ప్రముఖ రచయిత విక్రమ్‌ సేథ్‌ ‘హనుమాన్‌ చాలీసా’ను ఆంగ్లంలోకి అనువదించారు. దశాబ్దం కాలంలో ఆయన అనువాదం చేసిన మొదటి రచన ఇదే కావడం విశేషం. దీనికి సంబంధించిన వివరాలను ‘స్పీకింగ్‌ టైగర్‌’ అనే ప్రచురణ సంస్థ వెల్లడించింది. ఈ పుస్తకంలోని పద్యాలు ఆంగ్లంతో పాటు దేవనాగరి, రోమన్‌లిపిలో కూడా ఉన్నాయి.

రాహుల్‌గాంధీ
లోక్‌సభలో విపక్ష నేతగా కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి స్పీకర్‌ ఓంబిర్లా గుర్తింపునిచ్చారు. ఈ మేరకు లోక్‌సభ సచివాలయం ప్రకటన (నోటిఫికేషన్‌) వెలువరించింది. దిగువసభలో ప్రతిపక్ష నేత ఉండడం పదేళ్ల విరామం తర్వాత ఇదే మొదటిసారి. ఈ హోదా పొందడానికి అవసరమైన 10 శాతం సంఖ్యాబలం విపక్షాలకు లేకపోవడంతో 16, 17 లోక్‌సభల్లో ఎవరికీ ఇది లభించలేదు.

స్పోర్ట్స్​

పారిస్‌ ఒలింపిక్స్‌ భారత బాక్సర్లు
పారిస్‌ ఒలింపిక్స్‌కు మహిళల విభాగంలో నిఖత్‌ జరీన్‌ (50 కేజీలు), ప్రీతి (54 కేజీలు), జైస్మిన్‌ (57 కేజీలు), లవ్లీనా (75 కేజీలు).. పురుషుల విభాగంలో అమిత్‌ పంఘాల్‌ (51 కేజీలు), నిశాంత్‌ దేవ్‌ (71 కేజీలు) భారత్‌కు ప్రాతినిధ్యం వహించ‌నున్నారు.

నార్వే చెస్‌ టోర్నీ
నార్వేలోని స్టావెంజర్ నగరంలో జరుగుతున్నచెస్ టోర్నీ ఐదో రౌండ్‌లో ప్రజ్ఞానంద 77 ఎత్తుల్లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఫాబియానో కరువానా (అమెరికా)పై గెలిచాడు. ఇదే టోర్నీ మూడో రౌండ్‌లో ప్రజ్ఞానంద ప్రపంచ నంబర్‌వన్‌ కార్ల్‌సన్‌ను ఓడించారు. ప్రజ్ఞానంద సోదరి వైశాలి ప్రపంచ మూడో ర్యాంకర్‌ టింగ్జీ లె (చైనా)పై 76 ఎత్తుల్లో గెలిచింది.

ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్స్​
కార్లోస్‌ అల్కరాస్‌ (స్పెయిన్‌) తొలిసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచాడు. అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ) పై విజయం సాధించి అల్కరాస్‌ రొలాండ్‌ గారోస్‌లో చాంపియన్‌గా నిలిచాడు. మహిళల సింగిల్స్‌లో వరుసగా మూడో ఏడాది వరల్డ్‌ నంబర్‌వన్‌ ఇగా స్వియాటెక్‌ చాంపియన్‌గా నిలిచింది.12వ సీడ్‌ జాస్మిన్‌ పావ్లిని (ఇటలీ)పై ఘన విజయం సాధించింది.

వెర్‌స్టాపెన్‌ ‘హ్యాట్రిక్‌’
వరుసగా మూడో ఏడాది కెనడా గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ నెగ్గి ‘హ్యాట్రిక్‌’ నమోదు చేసిన వెర్‌స్టాపెన్‌ కెరీర్‌లో ఓవరాల్‌గా 60వ విజయం సాధించాడు.‘పోల్‌ పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన జార్జి రసెల్‌ (మెర్సిడెస్‌) మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

హ్యాట్రిక్‌ స్వర్ణంతో జ్యోతి త్రయం
భారత మహిళల కాంపౌండ్‌ లో జ్యోతి సురేఖ, అదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ త్రయం దూసుకెళ్తోంది. తాజాగా మూడో అంచె ప్రపంచకప్‌లోనూ కాంపౌండ్‌ మహిళల జట్టు స్వర్ణాన్ని ఈ భారత బృందం సొంతం చేసుకుంది. ఈ ఏడాది జరిగిన మూడు ప్రపంచకప్‌ల్లోనూ బంగారు పతకాలతో ఈ త్రయం హ్యాట్రిక్‌ కొట్టింది.

ఆర్చరీ ప్రపంచకప్‌లో మెడల్స్​
మూడో అంచె ఆర్చరీ ప్రపంచకప్‌లో తెలుగు కుర్రాడు బొమ్మదేవర ధీరజ్‌ రికర్వ్‌ వ్యక్తిగత, మిక్స్‌డ్‌ టీమ్‌ విభాగాల్లో రెండు కాంస్య పతకాలతో సత్తాచాటాడు. మహిళల వ్యక్తిగత కాంస్యం పోరులో అంకిత, వాలెన్సియా చేతిలో ఓడింది.

సైన్స్ అండ్​ టెక్నాలజీ

‘అగ్నిబాణ్‌’ సక్సెస్​
చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. ఇందులో తొలిసారి సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ లిక్విడ్ ఇంజిన్‌ కంట్రోల్డ్‌ ఫ్లైట్‌ నిర్వహించినట్లైంది. దీనిలో ప్రపంచంలోనే తొలిసారి తయారుచేసిన సింగిల్‌పీస్‌ త్రీడీ ప్రింటెడ్‌ సెమీ క్రయోజనిక్‌ ఇంజిన్‌ను అమర్చారు.

అంతరిక్షంలో సునీతా విలియమ్స్​
భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్‌మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టారు. బోయింగ్ కంపెనీ అభివృద్ధి చేసిన స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో వారు ప్రయాణించారు. ఇప్పటికే ఐఎస్‌ఎస్‌లో ఏడుగురు వ్యోమగాములు ఉండగా, ఇప్పుడు సంఖ్య తొమ్మిదికి చేరింది.

పుష్పక్‌ ప్రయోగం సక్సెస్​
పునర్‌ వినియోగానికి అవకాశం ఉండే అంతరిక్ష వాహనం (రీ యూజబుల్‌ లాంచ్‌ వెహికల్‌) ‘పుష్పక్‌’ను ఇస్రో మూడోసారి విజయవంతంగా ప్రయోగించింది. చినూక్‌ హెలికాప్టర్‌ పుష్పక్‌ను 4.5 కి.మీ. ఎత్తుకు తీసుకెళ్లి విడిచిపెట్టింది. స్వయంచాలిత వ్యవస్థల ద్వారా రన్‌వేను కనుగొన్న పుష్పక్‌ నిర్దేశిత ప్రదేశంలో సురక్షితంగా దిగింది.

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మే​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఏప్రిల్​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : మార్చి​​​​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : ఫిబ్రవరి​ 2024

DONT MISS కరెంట్​ అఫైర్స్​ : జనవరి​ 2024

merupulu.com
RELATED ARTICLES
PRACTICE TEST
text books free download
indian constitution
LATEST
telangana history
CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!