తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదలయ్యాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫైనల్ కీతో పాటు మెయిన్స్‌కు సెలెక్టయిన అభ్యర్థుల ఫలితాల జాబితాను టీజీపీఎస్సీ ఆదివారం ప్రకటించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు పరిశీలించిన తర్వాత కమిషన్ తుది కీ విడుదల చేసింది. అనంతరం ఫలితాలు వెల్లడించింది. ఫలితాలు టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున గ్రూప్-1 మెయిన్స్‌కు 31,382 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు వెల్లడించింది.
అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇప్పటికే టీజీపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచే అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
జూన్ 13న గ్రూప్ 1 ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్న పత్రాన్ని అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉంచింది. ప్రిలిమినరీ కీ పై అభ్యంతరాలు స్వీకరించిన తరవాత నిపుణుల అభిప్రాయాలతో ఫైనల్ కీతో పాటు ఫలితాలు విడుదల చేసింది.
టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్ష మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక 1:50 నిష్పత్తిలో కాకుండా 1:100 నిష్పత్తిలో చేయాలని విద్యార్థి సంఘాలు, కొందరు అభ్యర్థులు ఇటీవల ఆందోళనలు చేపట్టారు. టీజీపీఎస్సీ మాత్రం గ్రూప్-1 మెయిన్స్‌కు 1:50 నిష్పత్తిలోనే ఎంపిక ఉంటుందని స్పష్టం చేసింది. సాధారణ పరిపాలన శాఖ జారీ చేసిన జోవో 29, 55 నిబంధనల మేరకే అభ్యర్థులను ఎంపిక చేసింది.