భారతదేశంలో బ్రిటీష్ గవర్నర్ జనరల్స్
- వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 1774 వరకు బెంగాల్ చివరి గవర్నర్ గా పనిచేశారు.
- 1774 నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీటి మొదటి గవర్నర్ జనరల్ లేదా తొలి గవర్నర్ జనరల్ ఆఫ్ ఫోర్ట్విలియం.
- బెంగాలీ, పర్షియన్ భాషలపై అవగాహన కలిగిన ఏకైక గవర్నర్ జనరల్.
- పన్ను వసూళ్ల కోసం 1772లో బెంగాల్లో కలెక్టర్ నియామకం చేపట్టారు. కోశాగారాన్ని కలకత్తా నుంచి ముర్షీదాబాద్కు మార్పు చేశాడు.
- బెంగాల్ ద్వంద్వ ప్రభుత్వాన్ని రద్దు చేశాడు. ఇతని కాలంలో మేజర్ రన్నెల్ ఆధ్వర్యంలో బెంగాల్ అట్లాస్ రూపుదిద్దుకుంది.
- వారన్ హేస్టింగ్స్ కాలంలో రోహిల్లా యుద్ధం(1772), మొదటి ఆంగో– మరాఠా యుద్ధం(1775–82), రెండో ఆంగ్లో–మైసూర్ యుద్ధం(1780–84) జరిగాయి. ఇతను మరాఠాల స్వతంత్ర అధికారాన్ని నిర్వీర్యం చేశాడు.
- బ్రిటిష్ పార్లమెంట్ మొదటిసారి యాజమాన్య లోపం, అవినీతి అంశాల రీత్యా అభిశంసన మోపిన మొదటి గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్
- లార్డ్ కారన్ వాలీస్ భారతదేశ సివిల్ సర్వీసెస్ పితామహుడు. 1793లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశ పెట్టాడు.
- న్యాయపరమైన, పోలీస్ అధికారాలను జమీందారుల నుంచి వేరు చేశాడు. న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖ నుంచి వేరు చేశాడు.
- ఉద్యోగులకు సరైన జీతాలను చెల్లించడం ద్వారా నిజాయితీని పెంపొందించవచ్చని నమ్మని గవర్నర్ జనరల్ లార్డ్ కారన్ వాలీస్
- పటిష్ఠమైన పోలీస్ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. కారన్ వాలీస్ కాలంలో మూడో ఆంగ్లో – మరాఠా యుద్ధం జరిగింది.
- కారన్ వాలీస్ బ్రిటిష్ పార్లమెంట్ చేత అభివంసన తీర్మానానికి గురయ్యాడు.
- సర్ జాన్ షోర్ కాలంలో బెంగాల్లో ఆంగ్లేయ అధికారులు తిరుగుబాటు చేశారు.
- ఇతడు నాన్ ఇంటర్వెన్షన్ (తటస్థ) విధానాన్ని కచ్చితంగా పాటించాడు.
- జమీందారీ విధానాన్ని రూపొందించాడు.
- లార్డ్ వెల్లస్లీ తనకు తానుగా బెంగాల్ పులిగా అభివర్ణించుకున్నాడు. 1798లో సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టాడు.
- 1800లో కలకత్తా పోర్ట్ విలియం కళాశాలను నిర్మించాడు.
- లార్డ్ వెల్లస్లీ కాలంలో నాలుగో ఆంగ్లో– మైసూర్ యుద్ధం, రెండో ఆంగ్లో– మారాఠా యుద్ధం జరిగింది.
error: Content is protected !!
Super