2024-–25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ (ఆనర్స్) ఫారెస్ట్రీ నాలుగు సంవత్సరాల కోర్సులో అడ్మిషన్స్‌కు అప్లికేషన్స్ కోరుతున్నట్లు సిద్దిపేట జిల్లా ములుగు (హైదరాబాద్)లోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థ (ఎఫ్‌సీఆర్‌ఐ) నోటిఫికేషన్ జారీ చేసింది.
అర్హత: ఇంటర్మీడియట్(పీసీబీ/ పీసీఎం/ పీసీఎంబీ)తో పాటు టీజీ ఎంసెట్-2024 ర్యాంకు సాధించి ఉండాలి. టీజీ ఎంసెట్-2024 ర్యాంకు ఆధారంగా ఎంట్రెన్స్ ఉంటుంది.
దరఖాస్తులు: జూన్ 6 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సీట్లలో 75 శాతం ఇంటర్ బైపీసీ విద్యార్థులకు, 25 శాతం ఎంపీసీ విద్యార్థులకు కేటాయించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు 8074350866, 9666460939 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు www.fcrihyd.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు.


