టీఎస్పీఎస్సీ మరో బిగ్ నోటిఫికేషన్ జారీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం ఈ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. శుక్రవారం ఉదయాన్నే టీఎస్పీఎస్సీ బోర్డు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్ 2 లేదా జూనియర్ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌పై ఈ బోర్డు మీటింగ్ చర్చించనున్నట్లు తెలిసింది. మీటింగ్ ముగిసిన తర్వాత గ్రూప్ 2 లేదా జూనియర్ లెక్చరర్లకు సంబంధించిన వెబ్‌నోట్ రిలీజ్ చేసే అవకాశమున్నట్లు బోర్డు వర్గాల ద్వారా సమాచారం అందింది.
728 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్
వివిధ పోస్టుల మార్పులు చేర్పులతో ఇటీవలే గ్రూప్ 2కు సంబంధించిన ఖాళీలు పెరిగాయి. ఇటీవల వివిధ విభాగాలు ఇచ్చిన తాజా సమాచారంతో మొత్తం 728 గ్రూప్ 2 ఖాళీలున్నట్లు ప్రభుత్వం లెక్కతీసింది. వీటి భర్తీకి ఫైనాన్స్ డిపార్టుమెంట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీంతో వారం రోజులుగా గ్రూప్ 2 పోస్టుల భర్తీ పైనే టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. అందుకే ఈ రోజు బోర్డు మీటింగ్‌లో తుది నిర్ణయం తీసుకొని షార్ట్ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశముంది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేకపోతే.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ మొగ్గు చూపనుంది. రెండింటిలో ఏదో ఒక నోటిఫికేషన్ కొద్ది గంటల వ్యవధిలోనే వెలువడే అవకాశముంది.
1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మొత్తం 1392 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జులైలోనే వీటి భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో వీటిని భర్తీ చేయాలని టీఎస్పీఎసీసీకి అనుమతి ఇచ్చింది. ఇటీవలే రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా జూనియర్ లెక్చరర్ల రిక్రూట్మెంట్కు సంబంధించి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వలేకపోతే జూనియర్ లెక్చరర్ల నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ముందుగా వెబ్ నోట్ జారీ చేసి ఈ నెలాఖరున డిటైల్డ్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు బోర్డు సన్నద్ధమైంది.
READ THIS: 1392 జూనియర్ లెక్చరర్ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్.. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలివే..
