Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఈరోజే టీఎస్​పీఎస్​సీ మరో బిగ్ నోటిఫికేషన్​

ఈరోజే టీఎస్​పీఎస్​సీ మరో బిగ్ నోటిఫికేషన్​

టీఎస్​పీఎస్​సీ మరో బిగ్ నోటిఫికేషన్​ జారీ చేసేందుకు సన్నాహాలు చేసుకుంది. ఈ రోజు సాయంత్రం ఈ నోటిఫికేషన్​ విడుదలయ్యే అవకాశముంది. శుక్రవారం ఉదయాన్నే టీఎస్​పీఎస్​సీ బోర్డు అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసుకుంది. తెలంగాణలో గ్రూప్​ 2 లేదా జూనియర్​ లెక్చరర్ల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్​పై ఈ బోర్డు మీటింగ్​ చర్చించనున్నట్లు తెలిసింది. మీటింగ్ ముగిసిన తర్వాత గ్రూప్​ 2 లేదా జూనియర్​ లెక్చరర్లకు సంబంధించిన వెబ్​నోట్​ రిలీజ్​ చేసే అవకాశమున్నట్లు బోర్డు వర్గాల ద్వారా సమాచారం అందింది.

Advertisement

728 పోస్టులతో గ్రూప్​ 2 నోటిఫికేషన్​

వివిధ పోస్టుల మార్పులు చేర్పులతో ఇటీవలే గ్రూప్​ 2కు సంబంధించిన ఖాళీలు పెరిగాయి. ఇటీవల వివిధ విభాగాలు ఇచ్చిన తాజా సమాచారంతో మొత్తం 728 గ్రూప్​ 2 ఖాళీలున్నట్లు ప్రభుత్వం లెక్కతీసింది. వీటి భర్తీకి ఫైనాన్స్​ డిపార్టుమెంట్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. దీంతో వారం రోజులుగా గ్రూప్​ 2 పోస్టుల భర్తీ పైనే టీఎస్​పీఎస్​సీ కసరత్తు చేస్తోంది. అందుకే ఈ రోజు బోర్డు మీటింగ్​లో తుది నిర్ణయం తీసుకొని షార్ట్ నోటిఫికేషన్​ ఇచ్చే అవకాశముంది. గ్రూప్​ 2 నోటిఫికేషన్​ ఇవ్వలేకపోతే.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన జూనియర్​ లెక్చరర్ పోస్టుల భర్తీకి టీఎస్​పీఎస్​సీ మొగ్గు చూపనుంది. రెండింటిలో ఏదో ఒక నోటిఫికేషన్​ కొద్ది గంటల వ్యవధిలోనే వెలువడే అవకాశముంది.

1392 జూనియర్​ లెక్చరర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్​ కాలేజీల్లో మొత్తం 1392 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది జులైలోనే వీటి భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. డైరెక్ట్ రిక్రూట్​మెంట్​ విధానంలో వీటిని భర్తీ చేయాలని టీఎస్​పీఎసీసీకి అనుమతి ఇచ్చింది. ఇటీవలే రోస్టర్​ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా జూనియర్​ లెక్చరర్ల రిక్రూట్​మెంట్​కు సంబంధించి టీఎస్​పీఎస్​సీ ఏర్పాట్లు చేసింది. గ్రూప్​ 2 నోటిఫికేషన్​ ఇవ్వలేకపోతే జూనియర్​ లెక్చరర్ల నోటిఫికేషన్​ విడుదల చేసే అవకాశాలున్నట్లు బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ముందుగా వెబ్​ నోట్​ జారీ చేసి ఈ నెలాఖరున డిటైల్డ్ నోటిఫికేషన్​ ఇచ్చేందుకు బోర్డు సన్నద్ధమైంది.
READ THIS: 1392 జూనియర్​ లెక్చరర్​ ఖాళీల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్.. సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలివే..​



Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!