తెలంగాణలో సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ పరిధిలో ఉన్న ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.
రాష్ట్ర కార్యాలయం పరిధిలో ఖాళీగా ఉన్న కో ఆర్డినేటర్లను భర్తీ చేస్తారు. గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఈ పోస్టులకు అర్హులవుతారు. అర్హులైన టీచర్లు ఈ నెల 10 నుంచి 17వ తేదీలోగా అప్లై చేసుకోవాలని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీ దేవసేన ఉత్తర్వులు జారీ చేశారు. డిప్యుటేషన్ పద్ధతిన వీటిఇ భర్తీ చేస్తారు. ఆన్ లైన్ పరీక్ష ద్వారా ఈ నియామకాలు చేపడుతారు. 2023 జనవరి మొదటి వారంలో ఈ పరీక్ష నిర్వహిస్తారు.
అర్హతలతో పాటు పరీక్షా విధానం, అప్లికేషన్లు, హాల్ టికెట్ల జారీ కి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో పొందుపరిచారు. ప్రతి జిల్లాలో అయిదు ఖాళీలున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 170 పోస్టులకు ఈ పరీక్ష ద్వారా భర్తీ చేస్తారు. పూర్తి నోటిఫికేషన్ ఇక్కడ అందుబాటులో ఉంది. అప్లికేషన్లకు సమగ్ర శిక్ష వెబ్సైట్ లింక్