టీఎస్పీఎస్సీ (TSPSC) పరీక్షల రీషెడ్యూల్లో భాగంగా హార్టికల్చర్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పరీక్షను వాయిదా వేసింది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 4వ తేదీన ఈ పరీక్ష జరగాల్సి ఉంది. పేపర్ల లీకేజీ కారణంగా తదుపరి పరీక్షలన్నీ రీషెడ్యూల్ చేయాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 4వ తేదీన జరగాల్సిన ఈ పరీక్షను జూన్ 17వ తేదీకి వాయిదా వేసింది. అందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్లో జరగాల్సిన మిగతా పరీక్షల తేదీలను ఒకటీ రెండు రోజుల్లో వెల్లడించే అవకాశముంది. యూపీఎస్సీ పరీక్షల తేదీలను బట్టి మిగతా పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేయాలని టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది.
